త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Education | సంస్క‌ర‌ణ‌ల పేరుతో ఇంట‌ర్ విలీనం స‌రికాదు

Inter Education | పాఠ‌శాల విద్య‌లో ఇంట‌ర్‌ (Inter Education)ను విలీనం (Integration) చేయ‌డం స‌రికాద‌ని.. సంస్క‌ర‌ణ‌ల పేరుతో విద్యార్థుల భ‌విష్య‌త్‌తో ప్ర‌యోగాలు చేయ‌డం మానుకోవాల‌ని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్య‌క్షుడు పీ మ‌హేశ్‌(PDSU President Mahesh), ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పొడ‌పంగి నాగ‌రాజు హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Nov 13, 2026, 5.15 pm IST

Inter Education | సంస్క‌ర‌ణ‌ల పేరుతో ఇంట‌ర్ విలీనం స‌రికాదు
Advertisement
  • ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌కు మేలు చేసే విధానాల‌ను ఖండిస్తున్నం
  • విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో మాట్లాడ‌కుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
  • పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్య‌క్షుడు పీ మ‌హేశ్ డిమాండ్‌

Inter Education | త్రినేత్ర న్యూస్‌: పాఠ‌శాల విద్య‌లో ఇంట‌ర్‌ (Inter Education)ను విలీనం (Integration) చేయ‌డం స‌రికాద‌ని.. సంస్క‌ర‌ణ‌ల పేరుతో విద్యార్థుల భ‌విష్య‌త్‌తో ప్ర‌యోగాలు చేయ‌డం మానుకోవాల‌ని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్య‌క్షుడు పీ మ‌హేశ్‌(PDSU President Mahesh), ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పొడ‌పంగి నాగ‌రాజు హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యా సంస్థ‌ల‌కు లాభాలు చేకూర్చే విధానాల‌ను పీడీఎస్‌యూ తీవ్రంగా ఖండిస్తుంద‌న్నారు. విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ‌, విద్యార్థి సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని చెప్పారు. ప్ర‌భుత్వ విద్యారంగ ప‌రిర‌క్ష‌ణ కోసం విద్యార్థులు, అధ్యాప‌కులు, ప్ర‌జాస్వామికవాదులు ఐక్యంగా ఉద్య‌మించాల‌ని పిలుపునిచ్చారు. ఈమేర‌కు శుక్ర‌వారం వారు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణ‌లో ఇంట‌ర్ విద్య‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌లు ప్ర‌తి ఒక్క‌రిని ఆందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. విలీనం వ‌ల్ల ఎదుర‌య్యే ప‌రిణామాల‌పై స‌మ‌గ్ర అధ్య‌య‌నం చేయ‌కుండా ప్ర‌భుత్వం ముందుకు వెళ్ల‌డం స‌రైంది కాదు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగంలో తెస్తున్న మార్పులు ప్ర‌భుత్వ విద్యా వ్య‌వ‌స్థ‌ను కేంద్రీక‌రించి ప్రైవేటిక‌ర‌ణ‌కు అనుకూలంగా మార్చే ప్ర‌మాదం ఉంది. క‌ళాశాల‌ల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించకుండా, వాటి భ‌విష్య‌త్‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌కుండా విలీన ప్ర‌తిపాద‌న‌లు తీసుకురావ‌డం స‌రికాదు.

ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి

ఇంట‌ర్ విలీనం వ‌ల్ల అధ్యాప‌కుల నియామ‌కాలు, విద్యార్థుల ప్ర‌వేశాలు, సామాజికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉంటుందో ప్ర‌భుత్వం వివ‌రించాలి. విద్యార్థి, ఉపాధ్యాయ‌, అధ్యాప‌క సంఘాలు, విద్యారంగ నిపుణుల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. జూనియ‌ర్ క‌ళాశాల‌ల్లో ఖాళీగా ఉన్న బోధ‌న, బోధ‌నేత‌ర పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలి.

Advertisement
Advertisement