Pamphlets | కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించండి.. వాళ్లంతా గతంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లే.. జగిత్యాలలో కరపత్రాల కలకలం
Pamphlets | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం ముగుస్తున్న వేళ జగిత్యాలలో కరపత్రాలు (Pamphlets) కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ (Congress) తరఫున బీఫామ్ పొందిన 35 మంది అభ్యర్థులు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసునని సామాన్య ఓటరు పేరుతో కరపత్రాలు వెలిశాయి.
Pamphlets | త్రినేత్ర.న్యూస్: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం ముగుస్తున్న వేళ జగిత్యాలలో కరపత్రాలు (Pamphlets) కలకలం సృష్టిస్తున్నాయి. జగిత్యాలలో కాంగ్రెస్ (Congress) తరఫున బీఫామ్ పొందిన 35 మంది అభ్యర్థులు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసునని సామాన్య ఓటరు పేరుతో కరపత్రాలు వెలిశాయి. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నవారికే ఇప్పుడు కాంగ్రెస్‌లో టికెట్లు ఇంచ్చారంటూ ఆరోపించారు. హస్తం పార్టీ అభ్యర్థులను ఓడించాలని అందులో పేర్కొన్నారు.
2019లో బీఆర్ఎస్ (BRS) తరఫున గెలిచిన వారి అవినీతితో 16 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారంటూ ఆరోపించారు. జగిత్యాలలో ఊసరవెల్లిలా రంగులు మార్చి, మాది నిజాయితీ గల కాంగ్రెస్ అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. రంగులు మార్చే నాయకులకు ఓటు వేయవద్దంటూ పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల్లో పోలింగ్ ఉందనగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా కరపత్రాలు పత్రాలు ప్రత్యక్షమవడంపై సర్వత్రా చర్చ జరుగుతున్నది.
జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ (Sanjay Kumar) , మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవన్ రెడ్డి.. ఎలక్షన్లలో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయంగా తన మెడ నరకడానికి కాంగ్రెస్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని భావోద్వేగానికి లోనయ్యారు. తన రెండు భుజాలుగా ఉన్న వ్యక్తులను తనకు దూరం చేశారని ఆవేదన చెందారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతూ కాంగ్రెస్ జెండాతో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు.
మాట మరిచిన రాహుల్..
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌పై ఫైరయ్యారు. పార్టీ మారొద్దని చెప్పి ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తలతో ఆయన తన బాధను పంచుకున్నారు. ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ వర్గాన్నే ఈ ఎన్నికల్లో గెలిపిస్తామని.. మీరు బాధపడొద్దని అక్కడున్నవారు జీవన్‌రెడ్డిని ఓదార్చారు. కాగా చట్టసభలకు ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలని గతంలో రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పిన విషయాన్ని కూడా జీవన్‌రెడ్డి గుర్తు చేశారు.
ఓటుతో కొట్టాలి..
వేరే పార్టీల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లను ఓటుతో కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే వారికి బుద్ధి వచ్చే అవకాశం ఉందని అన్నారు. తన వర్గం వారికి కాంగ్రెస్ సీట్లు నిరాకరించడంతో కొన్ని వార్డుల్లో స్వతంత్రులుగా బరిలో దిగారు. వారి తరఫున ఆయన ప్రచారం చేశారు.
కాంగ్రెస్ జెండాతో ప్రచారమా?
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గాన్ని పక్కనపెట్టి బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ఎలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు. మాయమాటలు చెబుతూ సంజయ్ కాంగ్రెస్ జెండాను ఎత్తుకుపోయాడన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



