Harish Rao | రేవంత్ రెడ్డీ.. ‘నంది ఎవరో.. పంది ఎవరో..’ నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది
Harish Rao | ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డీ.. అవును.. నువ్వు మాట్లాడిన ‘నంది ఎవరో.. పంది ఎవరో’ అన్న మాటలకు సమాధానం నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది అని నిప్పులు చెరిగారు.
- కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం ద్వారా నీ స్థాయి ఏ మాత్రం పెరగదు
- ఉద్యమ రథసారథిపై నోరు పారేసుకోవడం చాలా సులభమమే కావొచ్చు..
- కానీ ఆయనలా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడం వెయ్యి జన్మలెత్తినా నీ వల్ల కాదు
- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డీ.. అవును.. నువ్వు మాట్లాడిన ‘నంది ఎవరో.. పంది ఎవరో’ అన్న మాటలకు సమాధానం నీ 1000 రోజుల పాలనే తేటతెల్లం చేస్తోంది అని నిప్పులు చెరిగారు. మైకు దొరికిన ప్రతిసారీ కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం, వ్యక్తిగత దూషణలకు దిగడం ద్వారా నీ స్థాయి ఏమాత్రం పెరగదు. పైగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుంటే నీ రాజకీయ సంస్కారం, ఆలోచనా దౌర్భాగ్యం ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడం 1000 జన్మలెత్తినా నీవల్ల కాదు
ముఖ్యమంత్రిగా ప్రజల కష్టాలను పట్టించుకోవాలి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. కానీ నీ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిసారీ కేసీఆర్‌పై నిందలు మోపడం, దుర్భాషలాడడం నీ ఏకైక అజెండాగా మార్చుకున్నావు. ఈ డైవర్షన్ రాజకీయాలను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఒక్కసారి ఆలోచించు రేవంత్. తెలంగాణ అస్తిత్వం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఉద్యమ రథసారథి కేసీఆర్. స్వరాష్ట్రంలో పదేళ్లపాటు సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుబంధు, సంక్షేమం, సమగ్ర మౌలిక వసతులతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన దార్శనికుడు ఆయన. అలాంటి నాయకుడిపై నోరుపారేసుకోవడం చాలా సులభమే కావచ్చు, కానీ ఆయనలా తెలంగాణ కోసం నిబద్ధతతో పనిచేయడం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడపడం 1000 జన్మలెత్తినా నీవల్ల కాదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును చెరిపివేయడం ఎవరి తరమూ కాదు
సూర్యుడిపై ఉమ్మివేస్తే అది తిరిగి నీ ముఖం పైనే పడుతుంది తప్ప సూర్యుడి తేజస్సు తగ్గదు. నువ్వు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని విమర్శలు గుప్పించినా ఎన్ని బూతులు మాట్లాడిన, ఎన్ని తిట్లు తిట్టినా తెలంగాణ చరిత్ర నుంచి కేసీఆర్ పేరును, ప్రజల గుండెల్లోంచి ఆయన ముద్రను చెరిపివేయడం ఎవరి తరమూ కాదు అని తేల్చిచెప్పారు.
భూముల వ్యవహారాలపై వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు నీ దగ్గర జవాబు ఉందా?
ఇంతకీ నీ పాలనలో ఏం సాధించావో ప్రజలకు సమాధానం చెప్పు. ఆరు గ్యారెంటీల పేరిట ఇచ్చిన హామీల అమలు ఎక్కడకు పోయింది? రైతుబంధు, పూర్తిస్థాయి రుణమాఫీ, మహిళలకు సంక్షేమం, నిరుద్యోగ భృతి వంటి అనేక వాగ్దానాలపై నేడు ప్రజలు రోడ్లెక్కి నిలదీస్తున్నారు. హైడ్రా పేరుతో పేదల గూళ్లను కూల్చివేయడం, మూసీ ప్రాజెక్టుల పేరుతో సాగిస్తున్న వివాదాలు, భూముల వ్యవహారాలపై వెల్లువెత్తుతున్న ప్రజాందోళనలకు నీ దగ్గర జవాబు ఉందా? ఈ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక, ప్రతిరోజూ కేసీఆర్‌ను దూషిస్తే నీ పాలనా వైఫల్యాలు మరుగున పడిపోవు. కేవలం తిట్లతో ప్రజల కడుపు నిండదు, విమర్శలతో వ్యవస్థాగత సమస్యలు పరిష్కారం కావు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.
ప్రజలు కోరేది ప్రచార ఆర్భాటం కాదు.. నిజమైన పనితీరు.
ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. ప్రజలు చూసేది నీ ప్రగల్భాలు కాదు.. నీ పరిపాలన. ప్రజలు కోరేది ప్రచార ఆర్భాటం కాదు.. నిజమైన పనితీరు. ప్రజలు గమనిస్తున్నది నీ దూషణలు కాదు.. ఎన్నికల హామీల ఎగవేత. ఇప్పటికైనా ఈ స్థాయిలేని చిల్లర మాటలు, డైవర్షన్ రాజకీయాలు బంద్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై నిజాయితీగా దృష్టి పెట్టు. కేసీఆర్‌పై నీ మాటలను వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






