త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి

Singareni | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు ప్రతి ఏరియాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు.

P

Telangana | Published On Jul 18, 2026, 9.45 pm IST

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
Advertisement

Singareni | రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిని పెంచడంతో పాటు నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు వచ్చే మూడు నెలల పాటు ప్రతి ఏరియాకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రత్యేక అధికారులు బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, రవాణా, ఉత్పాదకత, పనితీరు మెరుగుదల, కార్పొరేట్–ఏరియా విభాగాల సమన్వయం, సీఎస్‌ఆర్ కార్యక్రమాలను ప‌ర్య‌వేక్షించారు. శనివారం సింగరేణి భవన్ నుంచి అన్ని ఏరియా జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ, బొగ్గు నాణ్యత, గ్రేడ్ పరిరక్షణ, ఉత్పత్తి, డిస్పాచ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణికి బొగ్గు నాణ్యతే గుర్తింప‌ని, ఈ విష‌యంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు.

వినియోగదారులకు ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణమైన బొగ్గునే అందేలా అన్ని ఏరియాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్ లేని బొగ్గు, షేల్ కలవడం వల్ల నాణ్యత దెబ్బతింటోందని అధికారులు వివరించగా, అలాంటి ప‌రిస్థితి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎండీ సూచించారు. వార్షిక బొగ్గు గ్రేడేషన్ ప్రణాళికకు అనుగుణంగా సీమ్‌ల వారీగా తవ్వకాలు చేపట్టాలని, ఓవర్‌బర్డెన్, రాళ్లు, షేల్‌ను బొగ్గుతో కలపకుండా విడిగా డంప్ చేయాలని ఆదేశించారు. అన్ని ఓపెన్‌కాస్ట్ గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో తగిన సంఖ్యలో క్రషర్లు ఎప్పుడూ పనిచేసేలా చూడాలని, ప్రతి సీహెచ్‌పీలో గ్రేడ్‌వారీగా రోజువారీ బొగ్గు రవాణా ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. ఉత్పత్తి నుంచి డిస్పాచ్ వరకు ప్రతి దశలో నాణ్యత నియంత్రణపై అధికారులు వ్యక్తిగత బాధ్యతతో వ్యవహరించాలని సీఎండీ స్పష్టం చేశారు.

సింగరేణి బొగ్గుపై వినియోగదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి అధికారి బాధ్యత అని, ప్రకటించిన గ్రేడ్‌కు అనుగుణంగా బొగ్గు సరఫరా చేయడం ద్వారా సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచాలని సీఎండీ స్ప‌ష్టం చేశారు. సమీక్ష సమావేశంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్‌వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కే వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈఅండ్‌ఎం) ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బీ వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) టీ శ్రీనివాస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement