త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mallu Ravi | మ‌ళ్లీ వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వమే.. వారివి ప‌గ‌టి క‌ల‌లే

Mallu Ravi | బీజేపీ, బీఆర్ఎస్‌వి ప‌గ‌టి క‌ల‌లు మాత్ర‌మే.. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అని నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్న వారికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

S

Telangana | Published On Apr 29, 2026, 5.49 pm IST

Mallu Ravi | మ‌ళ్లీ వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వమే.. వారివి ప‌గ‌టి క‌ల‌లే
Advertisement

Mallu Ravi | త్రినేత్ర‌.న్యూస్ : బీజేపీ, బీఆర్ఎస్‌వి ప‌గ‌టి క‌ల‌లు మాత్ర‌మే.. రాష్ట్రంలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మే అని నాగ‌ర్‌క‌ర్నూల్ ఎంపీ మ‌ల్లు ర‌వి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్న వారికి ఓట‌మి త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

పదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ ఎలాంటి న్యాయం చేయలేదు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అడ్డ‌గోలుగా దోచుకుంది.. రూ. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసి మా మీద అప్పుల భారం మోపిందని మ‌ల్లు ర‌వి ధ్వ‌జ‌మెత్తారు.

దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూం ఇల్లు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి, రిజర్వేషన్లు, ఉచిత విద్య అంటూ అనేక మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ గద్దె నెక్కింది. దేశంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ధరల నియంత్రణ, నల్ల ధనం తెచ్చి ప్రతి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని మండిప‌డ్డారు.

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మంత్రుల నేతృత్వంలో అద్భుత‌మైన ప్ర‌జాపాల‌న అందిస్తున్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు రూ. 500 బోనస్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత్ బస్ సౌకర్యం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 10 లక్షల రూపాయల ఆరోగ్య శ్రీ లాంటి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

Advertisement
Advertisement