త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | తెలంగాణ‌లో ముగిసిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్

Municipal Elections | తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది.

S

Telangana | Published On Feb 11, 2026, 5.20 pm IST

Municipal Elections | తెలంగాణ‌లో ముగిసిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేష‌న్ల‌కు పోలింగ్ ప్ర‌క్రియ ముగిసింది. బుధ‌వారం ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగింది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు క్యూలైన్ల‌లో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట‌ వరకు 48.54 పోలింగ్ శాతం నమోదైంది. మున్సిపాలిటీలలో 51.66 శాతం, కార్పొరేషన్లలో 40.96 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల ప‌రిధిలో స్వ‌ల్ప ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. ప‌లు పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఓట‌ర్ల‌ను ప్ర‌లోభపెట్టేందుకు య‌త్నించ‌గా, ప్ర‌తిప‌క్ష నేత‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు కూడా అధికార పార్టీకి వ‌త్తాపు ప‌ల‌క‌డంతో.. వారి తీరుపై బీఆర్ఎస్, బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వ‌ద్ద‌.. పోలీసులే ప్ర‌చారం నిర్వ‌హించి.. హ‌స్తం గుర్తుకు ఓటేయాల‌ని ఓట‌ర్లకు సూచించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

Advertisement
Advertisement