త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | నేటితో ముగియ‌నున్న‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం.. 11న పోలింగ్‌

Municipal Elections | మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం చివ‌రి అంకానికి చేరుకున్న‌ది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు (Election Campaign) మూగ‌వోనున్నాయి.

G

Telangana | Published On Feb 9, 2026, 7.59 am IST

Municipal Elections | నేటితో ముగియ‌నున్న‌ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం.. 11న పోలింగ్‌
Advertisement

Municipal Elections | త్రినేత్ర‌.న్యూస్‌: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారం చివ‌రి అంకానికి చేరుకున్న‌ది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మైకులు (Election Campaign) మూగ‌వోనున్నాయి. అనంత‌రం సైలెన్స్ పిరియ‌డ్ అమ‌ల్లోకి రానుంది. గ‌త రెండు వారాలుగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రాచారం నిర్వ‌హిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్‌, హ‌రీశ్ రావు, కిష‌న్ రెడ్డి, మంత్రులు కార్న‌ర్ మీటింగులు, బ‌హిరంగ స‌భ‌ల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు త‌మ వంతుగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇక సోమ‌వారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడ‌నుండ‌టంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో మునిగిపోయారు. ప్రచారానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో నాలుగైదు మున్సిపాలిటీలను చుట్టేసేలా షెడ్యూల్ ఖ‌రారు చేసుకున్నారు.

హోరెత్తిన ప్ర‌చారం..

సీఎం రేవంత్ రెడ్డి దాదాపు అన్ని జిల్లాల్లో బహిరంగసభల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. ఇక మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు త‌మ జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో రోడ్‌షోలు, ఇంటింటికీ తిరుతూ ప్ర‌చారం నిర్వ‌హించారు. బీఆర్ఎస్ తరపున కేటీఆర్ రోడ్‌షోలు, ర్యాలీలతో ప్ర‌చారాన్ని హోరెత్తించ‌గా, హరీష్‌ రావు త‌న‌దైన శైలిలో కార్న‌ర్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రచారంలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్‌ రావులతో పాటు పక్క రాష్ట్రాల ప్రముఖ నేతలు కూడా ప్ర‌చార రంగంలో దిగి ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని షెడ్యూల్ కూడా ఖ‌రారు చేసుకున్న జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాన్ చివ‌రి క్ష‌ణంలో త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఆనారోగ్యం కార‌ణంగా చెప్పిన‌ప్ప‌టికీ, తెలంగాణ‌పై ఆయ‌న చేసిన వ్య‌తిరేక వ్యాఖ్య‌ల‌తో పార్టీ న‌ష్టం జ‌రుగుతుంద‌ని భావించిన క‌మ‌లం నేత‌లు.. ప‌వ‌న్ ప్ర‌చారాన్ని అడ్డుకున్న‌ట్లు తెలుస్తున్న‌ది.

11న పోలింగ్‌

ప్రచార గ‌డువు ముగుస్తుండ‌టంతో ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు జరుగకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరుగనుంది. 13న ఓట్ల లెక్కించిన అనంత‌రం ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisement
Advertisement