Chamala Kiran Kumar Reddy | ఆర్టీసీ ఉద్యోగులు అధైర్యపడొద్దు.. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: ఎంపీ చామల
Chamala Kiran Kumar Reddy | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వం ప్రజాపాలన కోసం పని చేస్తుందని తెలిపారు. గతంలోలా నెలలకు నెలలు చర్చలు జరపాలని ప్రభుత్వం అనడం లేదని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరు రెచ్చగొట్టినా తొందరపడొద్దని సూచించారు.
కొంతమంది తమ స్వలాభం కోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పొన్నం ప్రభార్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మనకు ప్రాణాలు ముఖ్యమని, మన వెనుక కుటుంబ సభ్యులు ఉన్నారని, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి చర్చల్లో పాల్గొనాలని చెప్పారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని వెల్లడించారు.
సచివాలయానికి ఆర్టీసీ జేఏసీ నేతలు..
మరోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచిన సంగతి తెలిసిందే. దీంతో కార్మిక నాయకులు సెక్రటేరియెట్‌కు వెళ్లారు. సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అంతకుముందు శంకర్ గౌడ్ మృతి, ప్రభుత్వం చర్చలకు పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ప్రభుత్వంతో తమ సమస్యల పరిష్కారంపై చర్చించడానికి సచివాలయానికి వెళ్లారు. సీనియర్ ఐఏఎస్ కమిటీతో సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారాల కోసం చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, జూపల్లితో సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






