త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kadiyam Srihari | వేల ఎక‌రాలు క‌బ్జా చేసి.. సిగ్గు లేకుండా అరుస్తున్నారు : క‌డియం శ్రీహ‌రి

Kadiyam Srihari | బీఆర్ఎస్ హ‌యాంలో ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకుని వంద‌ల వేల ఎక‌రాలు క‌బ్జా చేసి.. ఇవాళ శాస‌న‌స‌భ‌లో సిగ్గు లేకుండా అరుస్తున్నార‌ని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ధ్వ‌జ‌మెత్తారు.

S

Telangana | Published On Mar 29, 2026, 12.47 pm IST

Kadiyam Srihari | వేల ఎక‌రాలు క‌బ్జా చేసి.. సిగ్గు లేకుండా అరుస్తున్నారు : క‌డియం శ్రీహ‌రి
Advertisement

Kadiyam Srihari | త్రినేత్ర‌.న్యూస్ : బీఆర్ఎస్ హ‌యాంలో ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకుని వంద‌ల వేల ఎక‌రాలు క‌బ్జా చేసి.. ఇవాళ శాస‌న‌స‌భ‌లో సిగ్గు లేకుండా అరుస్తున్నార‌ని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ధ్వ‌జ‌మెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ప్రైవేటు పరిశ్రమ యజమానులను బెదిరించి హరీష్ రావు తమ్ముడు మహేశ్ రావు ధరణి ద్వారా వందల ఎకరాలు భూ బదలాయింపు చేసుకున్నారు. హరీష్ రావు ఒప్పుకుంటే.. దీనిపై హౌస్ కమిటీ వేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి శాస‌న‌స‌భా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

త‌ద‌నంత‌రం క‌డియం శ్రీహ‌రి మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో అనేక రకాల భూక‌బ్జాలు జ‌రిగాయి. భూ దోపిడీ జరిగింది. ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న నేత‌లు వంద‌ల వేల ఎక‌రాల భూక‌బ్జాలు చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని బాలాన‌గ‌ర్‌లో భూ బ‌ద‌లాయింపులు చేశారు. దానిపై హౌస్ క‌మిటీ వేయ‌డానికి మేం సిద్ధంగా ఉన్నామ‌ని సీఎం ప్ర‌క‌టించారు. మేం కూడా హౌస్ క‌మిటీ వేయాల‌ని డిమాండ్ చేస్తున్నామ‌ని క‌డియం శ్రీహ‌రి పేర్కొన్నారు.

దొంగ‌త‌నం చేసిన వారు ఏ ర‌కంగా బాధ‌ప‌డుతున్నారో చూడండి. ధ‌ర‌ణిని అడ్డు పెట్టుకుని వంద‌ల ఎక‌రాలు క‌బ్జా చేసి సిగ్గు లేకుండా అరుస్తున్నారు. బాలాగ‌న‌ర్‌లో కంపెనీ య‌జ‌మానుల‌ను బెదిరించి ధ‌ర‌ణిని అడ్డం పెట్టుకుని వంద‌ల ఎక‌రాల భూమిని సొంతం చేసుకున్నార‌ని సీఎం చెప్పారు. హౌస్ క‌మిటీ వేయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పేస‌రికి సిగ్గు లేకుండా అరుస్తున్నారు. నిజాయితీ ఉంటే, ఎలాంటి త‌ప్పు చేయ‌క‌పోతే హౌస్ క‌మిటీకి ఒప్పుకోవాల‌ని క‌డియం డిమాండ్ చేశారు.

ద‌య‌చేసి మీరు(స్పీక‌ర్‌ను ఉద్దేశించి) త‌క్ష‌ణ‌మే హౌజ్ క‌మిటీ వేయాలి. స‌భ్యులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. కొంత‌మంది స‌భ్యులు సిగ్గు లేకుండా శాస‌న‌స‌భ్యుల‌మ‌ని మ‌రిచి అరుస్తున్నారు. ఇది స‌భా సంప్ర‌దాయాల‌కు మంచిది కాదు. సీఎం చెప్పిన‌ట్లు హౌస్ క‌మిటీకి అనుమ‌తి ఇవ్వాలి అని క‌డియం శ్రీహ‌రి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement