త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Uttam Kumar Reddy | నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్: మంత్రి ఉత‌మ్ రెడ్డి

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్: తెలంగాణ‌ నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత‌మ్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర‌ప్రదేశ్ తో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ‌ ప్రయోజనాలను బీఆర్ఎస్ నాయ‌కులు తాకట్టు పెట్టారని అన్నారు.

S

Telangana | Published On Jan 2, 2026, 10.08 am IST

Minister Uttam Kumar Reddy | నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్: మంత్రి ఉత‌మ్ రెడ్డి
Advertisement

Minister Uttam Kumar Reddy | హైదరాబాద్: తెలంగాణ‌ నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత‌మ్ రెడ్డి ఆరోపించారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌జాభ‌వ‌న్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథ‌కం కోసమే పీఆర్ఎల్ఐసీ నీటి సామర్ధ్యాన్ని 1 టీఎంసీకి కుదించార‌ని అన్నారు. ఆంధ్ర‌ప్రదేశ్ తో అలయ్ బలయ్ చేసుకుని తెలంగాణ‌ ప్రయోజనాలను బీఆర్ఎస్ నాయ‌కులు తాకట్టు పెట్టారని అన్నారు. కృష్ణా జలాశయాలలో 763 టీఎంసీలు తెలంగాణ‌కు కేటాయించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుండి శ్రీశైలంకు ఎందుకు మార్చారని ప్ర‌శ్నించారు. పీఆర్ఎల్ఐసీ 90 శాతం పూర్తి అయిందనడం వాస్తవం కాద‌ని, ప్రాజెక్టును పూర్తి చేయాలి అంటే రూ.80 వేల కోట్ల‌ పైచిలుకు వ్యయం అవుతుందని తెలిపారు.

తెలంగాణ వాటా ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు..

2015 లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.35 వేల కోట్లతో అంచనా వేశార‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. 2022 లో సీడ‌బ్ల్యూసీకి ఇచ్చిన డీపీఆర్ లో భూసేకరణ, కాలువల నిర్మాణం లేకుండానే రూ.55 వేల కోట్లకు పెంచార‌ని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పీఆర్ఎల్ఐసీ మీద పెట్టిన ఖర్చు రూ.27 వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో త‌మ‌ ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం రూ.7 వేల కోట్లు అని, జూరాల వద్దే కొనసాగితే ఇంత వ్యయం ఉండద‌ని అన్నారు. 90 టీఎంసీల నీటితో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ‌కం పూర్తికి కట్టుబడి ఉన్నామ‌ని అన్నారు. జలాశయాలలో తెలంగాణ వాటా పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితం..

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ లో వాదనలు గట్టిగా విపిస్తున్నామ‌ని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు. కృష్ణా జలాశయాలలో తెలంగాణ‌ ప్రభుత్వం గట్టిపట్టు పడుతుందనడానికి వై.ఎస్ .జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబుకు రాసిన లేఖే నిదర్శనమ‌ని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీటి రంగం నిర్లక్ష్యానికి గురైంద‌ని, నదీ జలాల అంశంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమ‌ని అన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement