Minister Sridhar Babu | ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి.. అన్ని విధాలా సహకరిస్తాం
Minister Sridhar Babu | భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ "భారత్ ఫ్యూచర్ సిటీ"ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా... నెట్‌జీరో లక్ష్యంతో, పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా "భారత్ ఫ్యూచర్ సిటీ"
పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేలా... సుస్థిరాభివృద్ధికి పెద్దపీట
'ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్'పై చర్చాగోష్ఠిలో మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar Babu | త్రినేత్ర న్యూస్ : భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ "భారత్ ఫ్యూచర్ సిటీ"ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా... నెట్‌జీరో లక్ష్యంతో, పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. "భారత్ సమ్మిట్-2026"లో భాగంగా 'ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్' అనే అంశంపై శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు ఆయా కాలాల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదకశక్తులుగా నిలిచాయన్నారు. ఇప్పుడు మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలనే లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషించనుందన్నారు. దీన్ని కేవలం ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా కాకుండా... ప్రజలు నివసించేందుకు, పని చేసేందుకు, చదువుకునేందుకు, పరిశోధనలు చేసేందుకు, నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా నిలిచే సమగ్ర నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, సౌర విద్యుత్, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామన్నారు.
ఇక్కడ ఏఐ, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ఈ జాబితాలో అమెజాన్, హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, మారుబెనీ, సెమ్‌కార్ప్, ఎన్‌టీటీ తదితర సంస్థలు ఉన్నాయన్నారు. దేశ పారిశ్రామిక, పట్టణాభివృద్ధికి ఒక కొత్త నమూనాగా నిలవబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. భూమి కేటాయింపుల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతుల వరకు అన్ని దశల్లోనూ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
చర్చాగోష్ఠిలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ సీఈవో విజయ్ మహాజన్, సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్& అర్బన్ ఎక్స్ పర్ట్ టికేందర్ సింగ్ పవార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ షేక్ సలావుద్దీన్, ప్రముఖ చరిత్రాకారులు సజ్జద్ షాహిద్, మాజీ ఎంపీ దివ్యా స్పందన తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



