త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivasa Reddy | బావ‌బామ్మ‌ర్దుల ఒంటి నిండా విషం.. మంత్రి పొంగులేటి విమ‌ర్శ‌

Ponguleti Srinivasa Reddy | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరి దూసుకుపోతుంటే.. బావ‌బామ్మ‌ర్దులు ఒంటి నిండా విషం నింపుకుని ప్ర‌భుత్వంపై చిమ్ముతున్నార‌ని రాష్ట్ర స‌మాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు.

S

Telangana | Published On Feb 26, 2026, 6.15 pm IST

Ponguleti Srinivasa Reddy | బావ‌బామ్మ‌ర్దుల ఒంటి నిండా విషం.. మంత్రి పొంగులేటి విమ‌ర్శ‌
Advertisement

కాళేశ్వ‌రం పేరుతో జేబులు నింపుకున్నారు..
50 టీఎంసీలు స‌ముద్రంలోకి వ‌దిలేశారు..
సాగునీటి ప్రాజెక్టుల‌ను చ‌క్క‌దిద్దుతున్నాం..
రంకెలు వేయ‌డం కాదు.. స‌భ‌కు రండి..
కేటీఆర్, హ‌రీశ్‌రావుకు మంత్రి పొంగులేటి పిలుపు

Ponguleti Srinivasa Reddy | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల మాదిరి దూసుకుపోతుంటే.. బావ‌బామ్మ‌ర్దులు ఒంటి నిండా విషం నింపుకుని ప్ర‌భుత్వంపై చిమ్ముతున్నార‌ని రాష్ట్ర స‌మాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిప‌డ్డారు. స‌చివాల‌యం మీడియా పాయింట్‌లో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, వివేక్‌తో క‌లిసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ప్ర‌జా ప్ర‌భుత్వంలో అమ‌ల‌వుతున్న‌ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తిప‌క్ష నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప్ర‌తి ఎన్నిక‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ప్ర‌తిప‌క్షాలు ఊహించిన దాని కంటే అత్య‌ధిక ఓట్లు సాధిస్తున్న‌ది కాబ‌ట్టే ఇద్ద‌రు బావ‌బామ్మ‌ర్దులు ఒంటి నిండా విషం నింపుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌పై అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ప‌దేళ్ల దొర‌ల పాల‌న‌లో ప్రాణ‌హిత - చేవెళ్ల ప్రాజెక్టును గాలికి వ‌దిలేసి.. కేవ‌లం వారి స్వార్థం, స్వ‌లాభం కోసం జేబులు నింపుకునేందుకు కాళేశ్వ‌రం ప్రాజెక్టును చేప‌ట్టారు. గత ప్ర‌భుత్వం ల‌క్ష‌ల‌ కోట్లు ఖ‌ర్చు చేసి నాలుగేళ్ల‌ల్లో కేవ‌లం 162 టీఎంసీలు మాత్ర‌మే లిఫ్ట్ చేశారు. ఇందులో 50 టీఎంసీల‌ను మ‌ళ్లీ స‌ముద్రంలోకి వ‌దిలిపెట్టారు. నిక‌రంగా 112 టీంఎసీలు మాత్ర‌మే అందుబాటులోకి తీసుకొచ్చారని మంత్రి తెలిపారు.

బీఆర్ఎస్ - బీజేపీది ఫెవికాల్ బంధం..

గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలోనే అసెంబ్లీ ఎన్నిక‌లకు ముందు బ్యారేజీలు లీక‌య్యాయి. ప్ర‌తి బ్యారేజీలో కొన్ని పిల్ల‌ర్లు కుంగిపోవ‌డం ప్ర‌త్య‌క్షంగా చూశాం. దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. విచార‌ణ జ‌రిపి గుట్టంతా ర‌ట్టు చేశారు అధికారులు. కాళేశ్వ‌రం ఈ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఏటీఎంగా ఉంది. రాష్ట్రం కోరితే ఎంక్వైరీ పెడుతామంటే.. సుప్రీంకోర్టు రిటైర్డ్ జ‌డ్జి ఘోష్ నేతృత్వంలో క‌మిటీ వేశాం. అసెంబ్లీలో నివేదిక పెట్టాం. కానీ ప్ర‌తిప‌క్షం ఎస్కేప్ అయింది. సీబీఐకి హ్యాండ్ ఓవ‌ర్ చేశాం. కానీ కేంద్రం నుంచి సీబీఐ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. ఈ విష‌యంలో బీఆర్ఎస్ బీజేపీ ఫెవికాల్ బంధం క‌నిపిస్తోంది అని మంత్రి పొంగులేటి విమ‌ర్శించారు.

రంకెలు వేయ‌డం.. విషం చిమ్మ‌డం..

సాగునీటి ప్రాజెక్టుల‌పై అసెంబ్లీలో చ‌ర్చిద్దాం అంటే ఎస్కేప్ అవుతారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు అసెంబ్లీకి రారు. వారు త‌యారు చేసిన బావ‌బామ్మ‌ర్దులు అసెంబ్లీ లోప‌ల, బ‌య‌ట రంకెలు వేయ‌డంతో పాటు ఒంటి నిండా విషం నింపుకుని క‌క్కుతున్నారు. గోదావ‌రిలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ఒక్క నీటి చుక్క‌ను వ‌దులుకోం అని చెప్పిన‌ప్పటికీ.. ప్ర‌తిప‌క్ష నేత‌లు వంక‌ర కూత‌లు కూస్తున్నారు. విష‌పూరిత‌మైన ఆలోచ‌న‌ల‌తో మాట్లాడుతున్నారు. నీటి పారుద‌ల ప్రాజెక్టుల ద్వారా కోట్ల రూపాయాలు కొల్ల‌గొట్టారు. ఈ అవినీతి బ‌య‌ట‌ప‌డొద్ద‌ని చెప్పి వారి అనుకూల మీడియాలో రాయించుకుంటున్నారని మంత్రి ధ్వ‌జ‌మెత్తారు.

ప్రాజెక్టుల‌ను చ‌క్క‌దిద్దుతున్నాం..

బావ‌బామ్మ‌ర్దులు కేవ‌లం విషం చిమ్మాడం త‌ప్ప‌.. మంచి స‌ల‌హాల ఇవ్వ‌డం లేదు. ప్ర‌భుత్వానికి స‌ల‌హా ఇవ్వ‌కపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. గ‌త ప్ర‌భుత్వం క‌ట్టిన ప్రాజెక్టులు కూలిపోతుంటే, చెల్లాచెదురు అవుతుంటే చ‌క్క‌దిద్దుతున్నాం. రూ. 8 ల‌క్ష‌ల 18 వేల కోట్ల అప్పులు చేసినా సంక్షేమ కార్య‌క్ర‌మాలు పాకుండా అభివృద్ధిలో ముందంజ‌లో ఉన్నాం. రాష్ట్రాభివృద్ధిని కుంటుప‌డ‌నివ్వ‌డం లేదు. కాబ‌ట్టి ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ప్ర‌తి ఎన్నిక‌లో దీవిస్తున్నారు. ఇవ‌న్నీ జీర్ణించుకోలేక బావ‌బామ్మ‌ర్దులు విషాన్ని చిమ్ముతూ ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement