త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Damodar Raja Narasimha | సంస్కృత భాష పూర్వ వైభవానికి కృషి : మంత్రి దామోదర్

Damodar Raja Narasimha | మంత్రి దామోదర్ రాజనర్సింహను సంస్కృత భాషా కోవిదులు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆధ్వర్యంలో కలిసి మెదక్ జిల్లాలోని కొల్చారంలో ప్రముఖ సంస్కృత పండితుడు మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశంపై చర్చించారు.

P

Telangana | Published On May 8, 2026, 9.30 pm IST

Damodar Raja Narasimha | సంస్కృత భాష పూర్వ వైభవానికి కృషి : మంత్రి దామోదర్
Advertisement

Damodar Raja Narasimha | మంత్రి దామోదర్ రాజనర్సింహను సంస్కృత భాషా కోవిదులు, మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఆధ్వర్యంలో కలిసి మెదక్ జిల్లాలోని కొల్చారంలో ప్రముఖ సంస్కృత పండితుడు మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశంపై చర్చించారు. సమావేశంలో సంస్కృత భాష విశిష్టతపై మంత్రి దామోదర్ రాజనర్సింహ భాషా కోవిదులు, పండితులతో విస్తృతంగా చర్చించారు. ప్రతి రాష్ట్రంలో సంస్కృత భాష ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలపై కూడా చర్చించారు. సంస్కృత భాషను నేటి తరానికి అందించాల్సిన అవసరంపై మంత్రి సుదీర్ఘంగా అభిప్రాయాలు పంచుకున్నారు.

పండితుల సూచనలు, సలహాలను స్వాగతించారు. సంస్కృత మహాకావ్యాలైన మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశంలకు తన వ్యాఖ్యానాలతో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మల్లినాథసూరి మెదక్ జిల్లాలో జన్మించారని పండితులు మంత్రికి వివరించారు. సంస్కృత భాషాభివృద్ధికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని మల్లినాథసూరి పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. సంస్కృత భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని వెల్లడించారు.

Advertisement
Advertisement