త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది.. రేవంత్ పంచే 5000 తీసుకొని కారు గుర్తుకు ఓటేయండి

రేవంత్ రెడ్డి 14 రోజులు అమెరికా పోతే తెలంగాణలో శబ్ద కాలుష్యం తగ్గింది.. మళ్లీ రాగానే మొదలైంది. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు 5 ఏళ్లు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా రెండేళ్లే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.

J

Telangana | Published On Feb 4, 2026, 6.49 pm IST

Harish Rao | మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉంది.. రేవంత్ పంచే 5000 తీసుకొని కారు గుర్తుకు ఓటేయండి
Advertisement
  • ముఖ్యమంత్రి అమెరికా వెళ్తే రాష్ట్రంలో శబ్ద కాలుష్యం తగ్గింది.. రాగానే మళ్లీ మొదలైంది
  • అక్కాచెల్లెళ్లకు రేవంత్ సర్కార్ బాకీ రూ. 60 వేలు.. అడిగితే మెడలో పేగులేసుకుంటాడట
  • బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా
  • మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 60,000 బాకీ పడింది
  • రేవంత్ రెడ్డి పంచే రూ. 5000 తీసుకోండి.. కారు గుర్తుకు ఓటేసి రూ. 2500 సాధించుకోండి
  • నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు

Harish Rao | త్రినేత్ర.న్యూస్ : నర్సాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి, హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 700 రోజులు దాటినా ఏ ఒక్క గ్యారంటీ పూర్తిగా అమలు కాలేదని దుయ్యబట్టారు.

harish rao participates in municipal election campaign in narsapur

  • కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుం కుమార్ ఏమో మహిళలకు ఇప్పటికే రూ. 2500 ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారు. ఇప్పటివరకు ఒక్కో మహిళకు రూ. 2500 చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 60,000 బాకీ పడింది. రేవంత్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బు కట్టలు నర్సాపూర్‌కు పంపిస్తున్నాడట. ఓటుకు రూ. 5000 పంచాలని చూస్తున్నాడు. ప్రజలారా.. రేవంత్ రెడ్డి ఇచ్చే ఆ 5000 తీసుకోండి, కానీ ఓటు మాత్రం కారు గుర్తుకే వేయండి. బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే ప్రభుత్వం మెడలు వంచి నెలనెలా రావాల్సిన రూ. 2500 సాధించుకుంటామన్నారు.
  • కేసీఆర్ ఇచ్చినవన్నీ ఈ ప్రభుత్వం బంద్ పెట్టింది. రైతుబంధు బంద్, కేసీఆర్ కిట్ బంద్, బతుకమ్మ చీరలు బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్, గొర్రెల పంపిణీ బంద్, దళిత బంధు బంద్.. ఇలా అన్నీ బంద్ పెట్టి ప్రజలను ఎగ్గొట్టాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద రూ.1,00,116 ఇస్తే.. రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా ఇస్తానని ఆశపెట్టి ఉన్న లక్ష రూపాయలు కూడా ఇవ్వకుండా రెండేళ్లుగా చెక్కుల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాడు.
  • ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అవ్వతాతలకు పెన్షన్ అడిగితే 'లాగుల తొండలు తీసి పెడతా' అంటాడు.. మహిళలకు 2500 అడిగితే 'మెడలో పేగులు వేసుకుంటా' అంటాడు.. తులం బంగారం ఏది అని అడిగితే 'గుడ్లు పీకి గోటీలు ఆడుతా' అంటాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలి.
  • ఒకసారి ఆలోచించండి.. కేసీఆర్ రాకముందు నర్సాపూర్ ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుంది? నర్సాపూర్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, బస్ డిపో కట్టింది, గల్లీ గల్లీకి రోడ్లు వేసింది కేసీఆర్ కాదా? మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, షాదీ ముబారక్, ఇమామ్ మౌజంలకు గౌరవ వేతనం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి ముస్లింల కోసం ఒక్క రూపాయి పని చేయలేదు.
  • బీజేపీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడగడమే తప్ప పేదలకు పని చేయదు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మనకు మొండిచేయి చూపించి.. గుజరాత్, ఏపీలకు నిధుల మూటలు ఇస్తున్నారు. మన సిమెంట్ ఫ్యాక్టరీని తెరవరు, మూసీకి నిధులు ఇవ్వరు. తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీకి మనమెందుకు ఓటు వేయాలి?
  • రేవంత్ రెడ్డి 14 రోజులు అమెరికా పోతే తెలంగాణలో శబ్ద కాలుష్యం తగ్గింది.. మళ్లీ రాగానే మొదలైంది. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు 5 ఏళ్లు ఉంటారు. కానీ ఈ ప్రభుత్వం ఉండేది ఇంకా రెండేళ్లే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు కేసీఆర్ ఉంటారు, నేనుంటాను. నర్సాపూర్ అభివృద్ధిని కొనసాగిస్తాం. అందుకే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి.
Advertisement
Advertisement