త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆందోళన

CJP | నీట్ పరీక్షల్లో జరిగిన లీకేజీలపై నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన నిర్వ‌హించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతతో పాటు పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

P

Telangana | Published On Jun 14, 2026, 6.01 pm IST

CJP | హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఆందోళన
Advertisement

CJP | నీట్ పరీక్షల్లో జరిగిన లీకేజీలపై నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో భారీ ఆందోళన నిర్వ‌హించారు. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతతో పాటు పార్టీ మద్దతుదారులు హాజరయ్యారు. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. నీట్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర మంత్రిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోనం వాంగ్ చుక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ఘటనకు బాధ్యత వ‌హించాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ‘కాక్రాచ్ ఉద్యమం’ దీర్ఘకాలంగా కొనసాగుతుందని స్పష్టం చేసిన వాంగ్ చుక్, దేశ అభివృద్ధి నినాదాల వెనుక వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోట్లాది యువత ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని స్ప‌ష్టం చేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి ముర‌ళి మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో కూడా పారదర్శకత లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో పాలనా వ్యవస్థ తప్పుదోవ పట్టిందని ఆయన ఆరోపించారు. లంచగొండితనం పెరిగిపోయిందని, దేశ సంపద కొందరి చేతుల్లో కేంద్రీకృతమవుతోందని వ్యాఖ్యానించారు. అంబానీ, ఆదానీ వంటి పెద్ద వ్యాపార వర్గాల వ‌ద్దే సంపద కేంద్రీకరణ జరుగుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో నాణ్యమైన విద్య అందించే పరిస్థితి క్షీణిస్తోందని, పాలకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆకునూరి మురళి విమర్శించారు.

Advertisement
Advertisement