Manne Krishank | కాంగ్రెస్ పాలనలో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నయ్
Manne Krishank | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయని, పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. మెటా సంస్థ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణకు బ్లాక్‌డే అని అన్నారు. ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకొస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
- మెటా కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి తెలంగాణకు బ్లాక్‌డే
- పెట్టుబడులపై ప్రభావం పడదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి
- కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్
- మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ విమర్శలు
Manne Krishank | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయని, పారిశ్రామిక రంగంలో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిషాంక్ విమర్శించారు. మెటా సంస్థ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం తెలంగాణకు బ్లాక్‌డే అని అన్నారు. ఇలాంటి దాడులు జరిగితే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ ముందుకొస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ హయాంలో పరిశ్రమలకు ప్రోత్సాహం
గతంలో కేసీఆర్ పాలనలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతులు కల్పించారని క్రిషాంక్ పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ హయాంలో 26వేల పరిశ్రమలు వచ్చాయని, 18.29 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో ఐటీ రంగంలో ఏడు వేల ఉద్యోగాలు పోయాయని విమర్శించారు. మెటా వంటి సంస్థపై దాడి చేయడం ఎందుకని ప్రశ్నించారు. రెండో అతిపెద్ద క్యాంపస్‌గా పేర్కొంటున్న మెటాపై దాడి పెట్టుబడులపై ప్రభావం చూపదా? అని నిలదీశారు. హైదరాబాద్‌కు గతంలో ఎన్నో కంపెనీలు వచ్చాయని, కేటీఆర్ తీసుకొచ్చిన కిటెక్స్ సంస్థ వరంగల్‌లో 20 వేల ఉద్యోగాలు కల్పించిందని చెప్పారు. ఫాక్స్‌కాన్ వంటి సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చాయని గుర్తుచేశారు. ఇప్పుడు తెలంగాణను బ్యాడ్ తెలంగాణగా మారుస్తున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ ఎందుకు ఖండించరు?
రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌కు వచ్చి ప్రవచనాలు చెబుతారని, శాంతి, సంయమనం గురించి మాట్లాడతారని క్రిషాంక్ అన్నారు. మరి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మెటా కార్యాలయంపై చేసిన దాడిని ఎందుకు ఖండించరని ప్రశ్నించారు. సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేస్తే దాడులు చేస్తారా? మెటాపై దాడి చేయడం దేనికి సంకేతమని నిలదీశారు. ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేస్తున్నారని, ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టారని ఆరోపించారు. రేఖ అనే జర్నలిస్టుపైనా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. సోషల్ మీడియా అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేస్తున్నారని, మాజీ డీజీపీలను సైతం వదలకుండా భయపెడుతున్నారని విమర్శించారు.
గ్లోబల్ సమిట్ కాదు.. గోబర్ సమిట్
సమ్మిట్ల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. రాష్ట్రంలో జరిగేది గ్లోబల్ సమిట్ కాదని, గోబర్ సమిట్ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం నేడు డౌన్ అయిందని అన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ తరహాలో పీఆర్ ట్యాక్స్ నడుస్తోందని, పొంగులేటి రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త స్కూల్ మొదలైందని, నైమిష స్కూల్స్ తీసుకొస్తున్నారని క్రిషాంక్ అన్నారు. ఇప్పుడు పొంగులేటి బిడ్డ స్వప్ని రెడ్డి స్కూల్ తెరుస్తున్నారని పేర్కొన్నారు. స్కూళ్లు తెరవడంలో రేవంత్, పొంగులేటి పోటీ పడుతున్నారని విమర్శించారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రి అమ్మాయిలు ఇద్దరూ కలిసి కార్పొరేట్ స్కూల్ పెడుతున్నారని వ్యాఖ్యానించారు. గురుకులాలన్నీ నిర్వీర్యమవుతున్నాయని, తెలంగాణ యూనివర్సిటీలతో ఒప్పందాలు ఎందుకు చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వేల కోట్లతో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ ఆస్పత్రులను పట్టించుకోవడం లేదు
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని క్రిషాంక్ విమర్శించారు. వరంగల్‌లో ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారని, కానీ టిమ్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను విస్మరించి ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వ్యాపారాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కంపెనీ పెట్టారని, పొంగులేటి తన కొడుకు కోసం డిఫెన్స్ కంపెనీ తెరిచారని ఆరోపించారు. సొంత ఎమ్మెల్యేలే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారని, రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి సైతం తప్పుబట్టారని గుర్తుచేశారు.
పొంగులేటిపై విచారణ ఎందుకు చేయరు?
కేసీఆర్‌కు పొలం ఉంటే తప్పా? అని క్రిషాంక్ ప్రశ్నించారు. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌పై మాట్లాడే ముందు ఆలోచించాలని సూచించారు. అన్ని ఏజెన్సీలతో విచారణ చేయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పొంగులేటిపై ఎందుకు విచారణ చేయడం లేదని నిలదీశారు. పొంగులేటిపై ఈడీ సోదాలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. అమిత్ షా ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రస్తావిస్తున్నారని, ఆయనతో ఏం ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. పొంగులేటి ఆస్తులపై బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చిందని, వాటిలో ఏ ఒక్కటి అమలు చేసిందో చెప్పాలని క్రిషాంక్ ప్రశ్నించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భయపెట్టి రాజకీయం చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో గుండాయిజం పెరుగుతోందని, దీనిపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహ్యించుకుంటున్నారని, కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ
నవంబర్ 21, 2026

Road Accident | డైట్ బిల్లులు ఇచ్చేందుకు వెళ్తూ ప్రిన్సిపాల్, వార్డెన్ మృతి.. పాఠశాలలో విషాద ఛాయలు.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
నవంబర్ 21, 2026

Deeksha Diwas | దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!
- ●Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్
- ●Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ
- ●Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం
- ●Road Accident | డైట్ బిల్లులు ఇచ్చేందుకు వెళ్తూ ప్రిన్సిపాల్, వార్డెన్ మృతి.. పాఠశాలలో విషాద ఛాయలు.. ఈ ఘోరం ఎక్కడ జరిగిందంటే!
- ●Deeksha Diwas | దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం

Kerala Teen Kidney Disease Fairness Cream | ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొన్న బాలిక.. ఏడాది తిరిగేసరికి కిడ్నీలు డ్యామేజ్!

Bollywood OTT | ఆరు వందల కోట్ల బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది - క్లైమాక్స్ ట్విస్ట్ మైండ్‌బ్లాక్

Urban Farming Scheme | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై ఉచిత శిక్షణ

Kaloji Kala Kshethram | కళా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే కాళోజీ కళాక్షేత్రం



