Sabitha Indra Reddy | నిరుద్యోగులపై లాఠీచార్జ్ దారుణం: సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించడం, వారిని అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు.
Sabitha Indra Reddy | ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీచార్జ్ చేయించడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించడం, వారిని అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆమె విమర్శించారు. ఉద్యోగాల ప్రకటన ఇవ్వకుండా జాప్యం చేస్తూ, నిరుద్యోగుల గొంతును లాఠీలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఎన్నికల ముందు లక్షలాది ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మెగా నోటిఫికేషన్లు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా నిరాశపరిచిందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఉద్యోగాల ప్రకటన కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న యువత సహనం కోల్పోయి వీధుల్లోకి వస్తోందని ఆమె పేర్కొన్నారు. నోటిఫికేషన్ల కోసం కోచింగ్ తీసుకుంటూ హైదరాబాద్ వంటి నగరాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి అభ్యర్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. “ప్రజాపాలన అంటే ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమా? కేసులు పెట్టడమా?” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థులు, నిరుద్యోగులు అనేక రోజులుగా ఉద్యోగాల భర్తీ కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.
రాష్ట్రంలో 20 వేలకుపైగా ఖాళీగా ఉన్న పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం 5 వేల పోస్టులతో సరిపెట్టాలని చూడటం నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయమని ఆమె అన్నారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు వెంటనే 20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, అరెస్టు చేసిన ప్రతి నిరుద్యోగిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కడుపు కొడుతూ, వారిపై లాఠీలు ఝులిపిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించిన సబితా ఇంద్రారెడ్డి, నిరుద్యోగులు, విద్యార్థుల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

TPS | ఇకపై సర్కారుబడుల్లో కార్పొరేట్ స్థాయి చదువులు.. రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించనున్న సీఎం
జూన్ 16, 2026

Municipal Elections | రెండునెలల్లో మున్సిపల్ ఎన్నికలు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
జూన్ 16, 2026

Amarajyothi Memorial | అమరజ్యోతిని సందర్శించిన ఉద్యమకారుల కమిటీ..
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Salar Jung Museum | గజల్స్‌తో మార్మోగిన సాలార్జంగ్ మ్యూజియం.. లలిత ఆనంద్ గానానికి శ్రోతలు ఫిదా
- ●Crop Bonus Telangana | సన్నాల బోనస్‌కు కోతలు.. రైతన్నకు వాతలు! రేవంత్ సర్కార్ వ్యవసాయ సమీక్షపై హరీశ్ రావు ధ్వజం
- ●TPS | ఇకపై సర్కారుబడుల్లో కార్పొరేట్ స్థాయి చదువులు.. రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించనున్న సీఎం
- ●Municipal Elections | రెండునెలల్లో మున్సిపల్ ఎన్నికలు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- ●Kajal Aggarwal | ఆహార కల్తీపై కాజల్ అగర్వాల్ పోరాటం - బాలీవుడ్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- ●Amarajyothi Memorial | అమరజ్యోతిని సందర్శించిన ఉద్యమకారుల కమిటీ..

Salar Jung Museum | గజల్స్‌తో మార్మోగిన సాలార్జంగ్ మ్యూజియం.. లలిత ఆనంద్ గానానికి శ్రోతలు ఫిదా

Crop Bonus Telangana | సన్నాల బోనస్‌కు కోతలు.. రైతన్నకు వాతలు! రేవంత్ సర్కార్ వ్యవసాయ సమీక్షపై హరీశ్ రావు ధ్వజం

TPS | ఇకపై సర్కారుబడుల్లో కార్పొరేట్ స్థాయి చదువులు.. రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించనున్న సీఎం

Municipal Elections | రెండునెలల్లో మున్సిపల్ ఎన్నికలు : మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు



