త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తే ఉద్య‌మం త‌ప్ప‌దు.. బీజేపీకి కేటీఆర్ వార్నింగ్‌..!

KTR | డీలిమిటేష‌న్ పేరుతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని, ఆ పోరాటానికి కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హిస్తారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు స్ప‌ష్టం చేశారు.

P

Telangana | Published On Apr 15, 2026, 2.27 pm IST

KTR | ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తే ఉద్య‌మం త‌ప్ప‌దు.. బీజేపీకి కేటీఆర్ వార్నింగ్‌..!
Advertisement

KTR | డీలిమిటేష‌న్ పేరుతో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తో మ‌రో ఉద్య‌మం త‌ప్ప‌ద‌ని, ఆ పోరాటానికి కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హిస్తారని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు స్ప‌ష్టం చేశారు. ఫీర్జాదిగూడ‌లో బీఆర్ఎస్ చేరిక‌లో కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. 'కేసీఆర్ ప్రాజెక్టులు, రోడ్లు క‌ట్టారు. మున్సిపాలిటీల‌ను, గ్రామాల‌ను బాగు చేశారు. దాంతోనే భూముల ధ‌ర‌లు పెరిగిన‌య్‌. రియ‌ల్ ఎస్టేట్ భూమ్ వ‌చ్చింది. ఆలోచ‌న చేయండి. ఇవాళ ప‌రిస్థితి ఏందీ? పూర్తి స్థాయిలో రియ‌ల్ ఎస్టేట్ ఢాం అన్న‌ది. మార్కెట్‌లో ఎవ‌రి వ‌ద్ద పైస‌లు లేవు. వీళ్లు ఇండ్లు క‌ట్టుడు కాదు.. కూల‌గొట్టుడే ఉన్న‌ది. హైద‌రాబాద్‌లో కొత్త‌ది ఒక్క‌టి మంజూరు చేయ‌లేదు. కానీ, వేల ఇండ్ల‌ను రేవంత్‌రెడ్డి బూల్డోజ‌ర్లు పెట్టి కూల‌గొడుతున్న‌డు. ఒక రోజు అమీన్‌పూర్‌లో, ఇంకోరోజు కూక‌ట్‌ప‌ల్లిలో, మ‌రో రోజు ఫిర్జాదిగూడ సాయిప్రియ లే అవుట్‌లో. ఎక్క‌డో అక్కడ గ‌రీబోళ్ల ఇండ్ల‌ను కూడ‌గొట్టుడే త‌ప్పా రేవంత్‌రెడ్డి ఏదైనా మంచి ప‌ని చేసిండా ఆలోచించండి' సూచించారు.

మ‌న‌కు అధికారం కొత్తం కాదు..

'మ‌నం ఇవాళ కొట్లాడుతున్న‌ది అధికారం కోసం కాదు. మ‌న‌కు అధికారం కొత్త‌దేం కాదు. మ‌నం ప‌దేళ్లు అధికారంలో ఉన్నామ‌న్నారు. ఈ క్ర‌మంలో స‌భ‌లో క‌రెంట్ క‌ట్ అయ్యింది. కొద్దిసేపు చీక‌ట్లోనే ఉండాల్సి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాల‌న ఎట్లుందంటే గిట్లుంది. పొద్దున‌పూట క‌రెంటు ఉండ‌దు. తెల్లారి మూడింటికే ఫ్యాన్ బందైత‌ది. బ‌య‌ట‌కు పోదామంటే దోమ‌లు.. ఇవాళ హైద‌రాబాద్‌లో ఎవ‌రైనా సంతోషంగా ఉన్న‌రా అంటే.. ఇద్ద‌రే ఇద్ద‌రు సంతోషంగా ఉన్నారు. ఒక‌టి దొంగ‌లు, ఇంకోటి దోమ‌లు. భూములు దోచుకునే దొంగ‌లు.. కాంగ్రెస్ దొంగ‌లు.. హైద‌రాబాద్ చుట్టూ అడ్డ‌మైన ప‌నులు చేసుకుంటూ ఈ రోజు భూముల‌పై ప‌డ్డ‌రు. పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, ఆయ‌న అన్న‌ద‌మ్ములు మొత్తం ఒక‌టై మేడ్చ‌ల్‌పై విరుచుకుప‌డ్డారు. ఇంకోదిక్కు దోమ‌లు. హైద‌రాబాద్‌లో హిమాయ‌త్‌న‌గ‌ర్ వ‌ద్ద దోమ‌ల‌గూడ అనే కాల‌నీ ఉంట‌ది. నేను అందుకే అసెంబ్లీలో చెప్పిన‌.. రేవంత్‌రెడ్డి గారు.. మ‌న్మోహ‌న్ సింగ్‌, డోనాల్డ్ ట్రంప్ పేరిట పేరు పెట్టావ‌ట క‌దా.. అట్ల‌నే దోమ‌ల‌హిల్స్‌, దోమ‌ల‌గుట్ట‌, దోమ‌ల‌బాద్‌, దూమ‌ల‌గోడ పేర్లు పెట్టాల‌ని చెప్పారు. క‌నీసం దోమ‌ల మందు కొట్ట తెలివి లేనోడివి నువ్వు ఏం ముఖ్య‌మంత్రి చేస్తున్న‌వ్ అనిశాస‌న‌స‌భ‌లో అడిగా'న‌న్నారు కేటీఆర్‌

త‌ప్పించుకునే ప్ర‌య‌త్నాలు

'అన్ని విష‌యాలు మీరు చూస్తున్న‌రు. ఎట్ల‌న్న చెప్పి, ఎట్ల‌న్న చేసి మ‌న‌ల్ని బ‌ద‌నాం చేసి.. అప్పుల‌పాలు చేశార‌ని త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌రు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమ‌లు చేసేదాకా, 420 పార్టీని గ‌ద్దె దించేదాక పోరాడుద‌మ‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నం. ఇంకో పార్టీని మ‌నం ఓ కంట క‌నిపెడుతూనే ఉండాలి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఉప్ప‌ల్ ఫ్లై ఓవ‌ర్ ఇంకా క‌డుతూనే ఉన్నారు. మ‌నం మాత్రం హైద‌రాబాద్‌లో 40 ఫ్లై ఓవ‌ర్లు క‌ట్టాం. నాలుగైదేళ్ల‌లోనే పూర్తి చేశాం. ఉప్ప‌ల్ ఫ్లై ఓవ‌ర్‌ను తామే క‌డ‌తామ‌ని చెబితే.. కాదు కాదు మేం క‌డ‌తామ‌ని చెప్పారు అని కేటీఆర్ గుర్తు చేశారు. జాతీయ ర‌హ‌దారి అయితే మేమైతేనే క‌డ‌త‌మ‌ని తీసుకున్న‌ర‌ని.. మ‌రి ఈ రోజు ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఎనిమిదేళ్ల‌యినా ఇంత వ‌ర‌కు అతీలేదు గ‌తీ లేదు. ఉప్ప‌ల్ నుంచి నారాప‌ల్లి వ‌ర‌కు రోడ్లు నర‌కం. ఫ్లై ఓవ‌ర్ మాత్రం పూర్తి కావడం లేదు. బీజేప పార్టీ సైతం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు గానీ, తెలంగాణ ప్ర‌జ‌ల కోసం చేసింది ఏమీ లేదు' అని స్ప‌ష్టం చేశారు.

కొత్త కుట్ర‌కు తెర‌

'కొత్త‌గా కుట్రకు తెర‌లేపింది. అసెంబ్లీ, పార్ల‌మెంట్ సీట్లు పెరుగుతున్న‌ట్లుగా మీరు పేప‌ర్ల‌లో చూసుంటారు. ఇందులోనూ కుట్ర క‌నిపిస్తున్న‌ది. బ‌య‌ట‌కు ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి మాట్లాడిన‌ప్పుడు 50 శాతం సీట్లు పెంచామ‌ని చెప్పారు. 110 సీట్లు ఉంటే.. 179కి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంద‌ని చెప్పారు. 17గా ఉన్న పార్ల‌మెంట్ సీట్లు 26 అవుతాయ‌ని చెప్పారు. రేపు పార్ల‌మెంట్ స‌మావేశాలు ఏర్పాటు చేశారు. బిల్లులో మాత్రం 50 శాతం సీట్ల పెంపు ముచ్చట లేనేలేదు. అంటే చెప్పేది ఒక‌టి.. చేసేదొక‌టి. అంద‌రూ ఒకటే గుర్తుంచుకోవాలి. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎప్పుడూ తెలంగాణ‌కు మిత్రుడు కాదు. 2014 ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్లు పెంచుదామ‌ని ఉంది. కానీ, ఆ చ‌ట్టాన్ని తుంగ‌లో తొక్కింది బీజేపీ. మ‌ళ్లీ ఈ రోజు సీట్ల పెంపు పేరుమీద కొత్త డ్రామాలు చేస్తూ.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల పేరుతో డ్రామాలు చేస్తున్న‌రు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు కేసీఆర్‌, బీఆర్ఎస్ పార్టీలు అనుకూల‌మే.

శాస‌న స‌భ‌, మండ‌లిలో తీర్మానం చేసి కేసీఆర్ నాయ‌క‌త్వంలో మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని చెప్పాం. ఇక్క‌డ మేం మార్కెట్ క‌మిటీలు, స్థానిక సంస్థ‌ల్లో 33శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశాం.. మీరు ఎందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించామ‌న్నారు. ఈ విష‌యంలో ఇబ్బంది లేదు. కానీ, డీలిమిటేష‌న్ పేరు మీద ద‌క్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ఊరుకోం. ఇవాళ 24శాతం వాటా ద‌క్షిణాది రాష్ట్రాల‌కు పార్ల‌మెంట్‌లో ఉన్న‌ది. దాన్ని పార్ల‌మెంట్‌లో య‌థాత‌ధంగా మెయింటెన్ చేయాల్సిందే. లేక‌పోతే ఎట్టి ప‌రిస్థితుల్లో తిరుగుబాటుకు, పెద్ద ఉద్య‌మానికి బీఆర్ఎస్ నాయ‌క‌త్వం వ‌హిస్తుంది. అవ‌స‌ర‌మైతే కేసీఆర్ ముందుండి న‌డిపిస్తారు' అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement