SLBC Tunnel | రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన: కేటీఆర్
SLBC Tunnel | రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ (SLBC) దుర్ఘటన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి (SLBC Tunnel) ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
SLBC Tunnel | త్రినేత్ర.న్యూస్: రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ (SLBC) దుర్ఘటన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి (SLBC Tunnel) ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని మండిపడ్డారు. ప్రమాదం ఏడాది గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ.. ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావన్నారు.
ఏడాది క్రితం ప్రమాదం..
నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి డిండి రిజర్వాయర్ వరకు మొత్తంగా 43.50 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. ఏకకాలంలో రెండు వైపుల నుంచి ఇన్‌లెట్ అంటే అచ్చంపేట మండలం దోమలపెంట వద్ద శ్రీశైలం రిజర్వాయర్ గట్టు నుంచి, అవుట్ లెట్ అంటే మహబూబ్‌నగర్ జిల్లా మన్యవారిపల్లె నుంచి సొరంగం పనులు చేపట్టారు. ఇన్‌లెట్ సొరంగం 13.93 కి.మీ వద్ద 2025, ఫిబ్రవరి 21న కుప్పకూలింది. దీంతో 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో ఆరుగురి జాడ తెలియలేదు. ఏడాది గడిచినా ఇప్పటికీ వారి మృతదేహాలను గుర్తించకపోవడం గమనార్హం.
https://x.com/KTRBRS/status/2025063464365162561
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



