KTR | ఇండ్లు కూలగొట్టుడు.. భూములు గుంజుకోవడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?: కేటీఆర్
KTR | త్రినేత్ర.న్యూస్: ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడం, ఇండ్లు కూలగొట్టడమేనాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా హైదరాబాద్‌లో ఒక్క ఇటుక పేర్చలేదని, కొత్తగా ఒక్క ఇళ్లూ కట్టలేని మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్: ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడం, ఇండ్లు కూలగొట్టడమేనాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా హైదరాబాద్‌లో (Hyderabad) ఒక్క ఇటుక పేర్చలేదని, కొత్తగా ఒక్క ఇళ్లూ కట్టలేని మండిపడ్డారు. పైగా వేల సంఖ్యలో ఇండ్లు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసీని బాగు చేయాలంటే ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చని వెల్లడించారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో బీఆర్ఎస్ హయాంలో నాగోల్‌లో నిర్మించిన ఎస్టీపీని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, సుదీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ వాణి దేవితో కలిసి కేటీఆర్ పరిశీలించారు. మూసీ పరివాహక ప్రాంతంలో చేపట్టిన సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. జేసీబీలను చూస్తే ఎక్కడ తమ ఇండ్లను కూలగొడతారేమోనని భయమేస్తుందని చెప్పారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. `గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులను రద్దుచేస్తామని వీళ్లే మాట్లాడుతున్నరు. హైదరాబాద్ ప్రజల తరపున ప్రభుత్వాన్ని అడిగేదేందంటే మూసీని బాగు చేయాలంటే ఇండ్లు కూలగొట్టకుండా కూడా చేయవచ్చు. ఒక్క ఇళ్లు కూలగొట్టకుండా గతంలో తాము నాగోల్‌లో ఎట్లయితే చేసినమో మంచిగా, అట్లా మొత్తం నువ్వు కూడా చేయ్. మేం వద్దంటలేం. మూసీలో మురికి నీటిని తేసేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టి మురికి నీటిని తీసే కార్యక్రమం చేసిండు. ఇప్పుడు దానిని చూసివచ్చినం.
మీరందరికి నాదొక విజ్ఞప్తి.. గడ్‌బడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరంతా ఐకమత్యంగా ఉంటే చాలు. ప్రభుత్వ అధికారులు వచ్చి డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తం, ఎక్కువ పరిహారం ఇస్తామంటూ మభ్యపెడుతరు. దానికి లొంగిపోకుండా.. అంతా ఒక్కమాట మీద ఉండి ఇండ్లు కూలగొట్టకుండా మంచిగ చేయండి మాకు అభ్యంతరం లేదని చెప్పండి.

భూములు గుంజుకోవడం, ఇండ్లు కూలగొట్టడం ఇది కాదు కదా ఇందిరమ్మ రాజ్యం అంటే. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోళ్లకు ఇండ్లు ఇవ్వడం. పేదవాడిని కడుపుల పెట్టుకుని చూసుకోవడం. అంతేగాని ఇండ్లు కూలగొడితే ఇందిరమ్మ రాజ్యం ఎట్లా అయితది. ఈ ప్రభుత్వం వచ్చి రెండున్నరేండ్లు అయింది.. హైదరాబాద్‌లో ఒక్క ఇటుక పేర్వలే, ఒక్క ఇళ్లు కట్టలే. ఉన్న ఇండ్లను కూలకొడుతుండు. ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టిండ్రు. అందుకే పేదవారికి జరిగిన అన్యాయం చూసి కేసీఆర్ సార్ మమ్మల్నందర్ని రోడ్లమీదికి పంపించిండ్రు. ఎల్బీనగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్ ఇలా ఎక్కడైన సరే రోడ్డెక్కి పేదవారికి అండగా నిలవాలని చెప్పిండు.
https://x.com/BRSparty/status/2029431298939650552
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



