KTR | స్కామ్‌లు, అక్రమాలు అధిష్టానానికి చెప్పినందుకే మీనాక్షిపై రేవంత్ దొంగ కేసు : కేటీఆర్
KTR | రేవంత్‌రెడ్డి సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ అక్రమాలు, స్కాములను అధిష్టానంకు చెప్పినందుకే మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ రెడ్డి దొంగ కేసు పెట్టిండని విమర్శించారు.
KTR | రేవంత్‌రెడ్డి సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ అక్రమాలు, స్కాములను అధిష్టానంకు చెప్పినందుకే మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ రెడ్డి దొంగ కేసు పెట్టిండని విమర్శించారు. తాను పెట్టిన దొంగ కేసును బీజేపీకి ఇచ్చి.. మీనాక్షికి పదవి రాకుండా చేసిండని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను అని సీఎం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పాలన 'అట్టర్ ఫ్లాప్' సినిమానేనని, ఇంటర్వల్‌కే అట్టర్ ప్లాప్ అయిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిదంటూ విమర్శలు గుప్పించారు. సగం పాలనా కాలం హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి
రేవంత్ రెడ్డి చేస్తున్న నీచ రాజకీయాలను ప్రస్తావిస్తూ, ఆయన సొంత పార్టీ నేతలనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని కేటీఆర్ విమర్శించారు. మీనాక్షి నటరాజన్‌కు టిక్కెట్ రాకుండా అడ్డుకోవడమే కాకుండా, తప్పుడు కేసులు పెట్టించడం రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి సొంత పార్టీ వాళ్లనే వెన్నుపోటు పొడిచారన్నారన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కొంత మంది వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్ నిజాయితీగల మనిషి.. రాహుల్ గాంధీకి నమ్మిన బంటు అన్న కేటీఆర్.. ఆమెపై రేవంత్ రెడ్డి కుట్ర చేశారని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి భూములు, కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, అడ్డగోలు అవినీతి చేస్తున్నాడని మీనాక్షి నటరాజ్ రాహుల్ గాంధీకి చెప్పినందుకే రేవంత్ పగపట్టారన్నారన్నారు. అందుకే మీనాక్షి నటరాజనం మీద రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో దొంగ కేసు పెట్టించారన్నారన్నారు.
దొంగ కేసు వివరాలు బీజేపీకి ఇచ్చి..
రేవంత్‌రెడ్డి చేసిన కుట్ర సమాచారం కూడా లేని ఆమె రాజ్యసభకు నామినేషన్ వేసిందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి తాను పెట్టిన దొంగ కేసు వివరాలు బీజేపీకి ఇచ్చారని ఆరోపించారు. ఇలా ప్రజలకే కాకుండా సొంత పార్టీ వాళ్లకి గుండు కొట్టి, శఠగోపం పెట్టిన దొంగ రేవంత్ రెడ్డి అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని సీఎం ప్రకటించడం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనను "అట్టర్ ఫ్లాప్"గా అభివర్ణించిన కేటీఆర్, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సినిమా ట్రైలర్ చూడగానే హిట్ లేదా ఫ్లాప్ అని తెలిసినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్వెల్‌కే ఫ్లాప్ అని తేలిపోయిందని, ఈ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.. కాంగ్రెస్ పాలనకు మిగిలిండ్ ఏండ్ కార్డే అన్నారు. అడ్డగోలుగా హమీలిచ్చిన అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. అందరినీ మోసం చేస్తున్నదన్నారు.
నాలుగువేల ఉద్యోగాలు భర్తీ చేయలే..
సగంకాలం ముగిసినా ఒక్క హమీల అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఒక అట్టర్ ప్లాప్ సినిమాతో పోల్చారు కేటీఆర్. నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 4 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని, అలాగే నిరుద్యోగ భృతి రూ.4వేల హామీని కూడా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేటీఆర్, కేసీఆర్ ఉద్యోగాలు ఊడగొట్టారని ఆరోపించిన రేవంత్.. ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. మహిళా హామీపై స్పందిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. అది నెరవేరితే నిరూపించాలని, లేని పక్షంలో తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒక్కో లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.1.25 లక్షలు బాకీ ఉందని గుర్తుచేశారు.
ప్రజాతీర్పును అవమానించడమే..
ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ప్రజా తీర్పును అవమానించడమేనని కేటీఆర్ అన్నారు. త్వరలో ఉపఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ ఆ ఉప ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పి, మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదని, ప్రజలు ఈ అసమర్థ పాలనను ఇంకా రెండున్నర ఏళ్లు భరించాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ఇటుక కూడా కొత్తగా పేదలకు ఇళ్లు కట్టించని ప్రభుత్వం, ఉన్న ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సాయాన్ని, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. "జీవో నెంబర్ 50 ద్వారా పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌ది. హైదరాబాద్‌లో ఇటుక కూడా వేయని కాంగ్రెస్, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గం" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

KTR | చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



