త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KCR | నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్.. ప్ర‌త్యేక గ‌దిలో విచార‌ణ‌

KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హైద‌రాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచార‌ణ నేప‌థ్యంలో ఎర్ర‌వ‌ల్లి నుంచి బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్ (Nandinagar) నివాసానికి వ‌చ్చారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రెండో ఫ్లోర్‌లోని ప్ర‌త్యేక గ‌దిలో కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించ‌నున్నారు.

G

Telangana | Published On Feb 1, 2026, 1.40 pm IST

KCR | నందినగర్‌కు చేరుకున్న కేసీఆర్.. ప్ర‌త్యేక గ‌దిలో విచార‌ణ‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) హైద‌రాబాద్ చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) విచార‌ణ నేప‌థ్యంలో ఎర్ర‌వ‌ల్లి నుంచి బంజారాహిల్స్‌లోని నందిన‌గ‌ర్ (Nandinagar) నివాసానికి వ‌చ్చారు. ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు రెండో ఫ్లోర్‌లోని ప్ర‌త్యేక గ‌దిలో కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సిట్ బృందం, పోలీసులు కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. విచార‌ణ‌కు కేసీఆర్‌ను ఒక్క‌రినే విచార‌ణ గ‌దిలోకి అనుమ‌తించ‌నున్నారు. విచార‌ణ‌ను వీడియో రికార్డు చేయ‌నున్నారు. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇప్ప‌టికే నందిన‌గ‌ర్ నివాసానికి చేరుకున్నారు. హ‌రీశ్ రావు, సంతోష్ కుమార్ మిన‌హా కేసీఆర్ ఇంట్లోకి పార్టీ నేత‌లు, ఇత‌ర సిబ్బందికి అనుమ‌తి నిరాక‌రించారు. నందిన‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ పోలీసుల‌ను మోహ‌రించారు. ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

కాగా, ఎర్ర‌వ‌ల్లి నుంచి హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన‌ కేసీఆర్‌కు ప్ర‌జ‌లు, బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నీరాజ‌నం ప‌లికారు. రోడ్డు మార్గంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారుపై పూలు జ‌ల్లుతూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్‌కు మ‌ద్ద‌తుగా, కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్‌తోపాటు పార్టీ నాయ‌కులు పెద్దఎత్తున త‌ర‌లిరావ‌డంతో రాజీవ్ ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ‌జ్వేల్ నుంచి వంటి మామిడి వ‌ర‌కు వాహ‌నాలు నిలిచిపోయాయి. అయితే వంటి మామిడి ద‌గ్గ‌ర కేసీఆర్ మిన‌హా ఇత‌ర వాహ‌నాలను పోలీసులు నిలిపివేశారు.

కేసీఆర్‌ను విచారించే టీమ్ ఇదే..

మాదాపూర్ డీసీపీ రీతిరాజ్‌, ఐపీఎస్ విజ‌య్ కుమార్‌, ఐపీఎస్ నారాయ‌ణ‌రెడ్డి, అడిష‌న‌ల్ ఎస్పీలు అర‌వింద్ కుమార్‌, కేఎస్ రావ్‌తో కూడిన బృందం కేసీఆర్‌ను విచారించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఫోన్ ట్యాపింగ్ కేసు ద‌ర్యాప్తులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన జూబ్లీహిల్స్ ఏసీపీ వెంక‌ట‌గిరి ఆదివారం నాటి విచార‌ణ‌కు దూరంగా ఉండ‌నున్నారు.

Advertisement
Advertisement