Kavitha | నార్సింగిలో కవిత ఆందోళన.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Kavitha | మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలు కడుతుంటే హైడ్రా (HYDRAA) కు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధినేత్రి కవిత (Kavitha) మండిపడ్డారు. కానీ పేదల ఇళ్లను మాత్రం కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. నార్సింగిలో భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం కవిత ఆందోళన చేపట్టారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్ : మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలు కడుతుంటే హైడ్రా (HYDRAA) కు కనిపించడం లేదా అని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధినేత్రి కవిత (Kavitha) మండిపడ్డారు. కానీ పేదల ఇళ్లను మాత్రం కూల్చివేస్తున్నారని దుయ్యబట్టారు. నార్సింగిలో భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం కవిత ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కానీ కుత్భుల్లాపూర్ లో పేదల ఇళ్లను కూల్చేశారని అన్నారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారని ధ్వజమెత్తారు. మూసీలో కూడా పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మూసీలో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి, ప్రభుత్వానికి కనబడటం లేదని ఎద్దేవా చేశారు. రంగనాథ్ కు ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పారని పేర్కొన్నారు. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు కూడా తామంతా ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు అక్రమించి కట్టిన బిల్డింగ్ ల గురించి మనం ఫిర్యాదులు ఇచ్చామని, కానీ ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే ఖమ్మంలోని వెలుగుమట్లలో 6 వందల మంది పేదల ఇళ్లు కూల్చేశారని గుర్తు చేశారు. త్వరలోనే అక్కడకు కూడా వెళ్తానని తెలిపారు. సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారని, దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే కడుతున్న, ఎవరికీ నష్టం లేని బిల్డింగ్ ను మాత్రం ఆపటం లేదని ఆరోపించారు. తమకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదని, ప్రభుత్వంతోనే తమ పంచాయితీ అని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత అమ్యామ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారని విమర్శించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని స్పష్టం చేశారు. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




