త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kalvakuntla Kavitha | నా మనసు విరిగింది.. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు

ఆయన కాంగ్రెస్ లో ఉంటే సీఎంతో మాట్లాడి హాస్పిటల్ లో సౌకర్యాలు కల్పించాలి. ప్రతిపక్షంలో ఉంటే హాస్పిటల్ లో సౌకర్యాల కోసం ధర్నా చేయాలి. మీరు ఏమీ చేయకపోతే జాగృతి తరఫున ఆ పని మేము చేస్తామని మండిపడ్డారు.

J

Telangana | Published On Dec 22, 2025, 5.39 pm IST

Kalvakuntla Kavitha | నా మనసు విరిగింది.. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదు
Advertisement

Kalvakuntla Kavitha | జాగృతి జనంబాట పేరుతో కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఆమె ఈ కార్యక్రమానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాలోని, 119 నియోజకవర్గాల్లో ఆమె ఈ సందర్భంగా పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. సోమవారం ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. తన మనసు విరిగిందని.. ఇక మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని ఆమె ప్రకటించారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా.. తాను ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో కూడా మన ఊరు - మన ఎంపీ పేరుతో ప్రజల్లోనే ఉన్నానన్నారు.

జనం బాటలో భాగంగా 15వ జిల్లాగా గద్వాల్‌కి

జనం బాటలో భాగంగా 15వ జిల్లాగా గద్వాల్‌కి వచ్చామని కవిత స్పష్టం చేశారు. గద్వాల్ అంటేనే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాంతంగా చెబుతారు. తుంగభద్ర, కృష్ణానది కలిగిన నడిగడ్డ ప్రాంతంగా ఉన్న జిల్లా ఇది. అన్ని సంస్కృతులు కలిగిన ఇక్కడి బాష అంటే నాకు చాలా ఇష్టం.

ఇక్కడి మనుషులు ముక్కుసూటిగా ఉంటారు. చాలా మంచి సంస్కృతి కలిగిన నేల. ఎంతో మేధా సంపత్తి కలిగిన నాయకులను ఇచ్చిన ప్రాంతం. సురవరం ప్రతాప్ రెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ, పుల్లారెడ్డి లాంటి వాళ్లు ఈ ప్రాంతం వాళ్లే అన్నారు.

తెలంగాణ వచ్చాక దాన్ని మంచి టూరిస్ట్ ప్రాంతంగా ప్రమోట్ చేసుకోవాల్సి చేసుకోలేకపోయాం. తిరుమలకు పంపించే ఏరువాడ జోరు పంచాలు కూడా మన గద్వాల్ నుంచే వెళ్తాయి. రాజోలి, గద్వాల్ చేనేత పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రాజులకు నేసే చేనేత వస్త్రాలను నేసే వారు గనుక రాజోలి అని పేరు వచ్చింది. ఈ ప్రాంతం పేరు చెప్పగానే ఆడబిడ్డలు ఇష్టపడే పట్టుచీరలు గుర్తుకు వస్తాయి. మన ప్రాంతంలో అద్భుతమైన కళాకారులు, వనరులు ఉన్నాయన్నారు.

Kalvakuntla Kavitha | రైజింగ్ తెలంగాణ అంటే ఇదేనా?

తెలంగాణ వచ్చాక మనం ఇంకా అభివృద్ధి అవుతామని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. దేశ వ్యాప్తంగా అక్షరాస్యత రేటు 80 శాతంగా ఉంటే తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో 76.9 శాతంగా ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 69 శాతంగానే ఉంది. అందులో గతేడాది మహిళల అక్షరాస్యత 65.9 శాతం ఉంటే 2025 నాటికి 61.1 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా మహిళల ఎడ్యుకేషన్ పెరుగుతుంటే తెలంగాణలో మహిళల ఎడ్యుకేషన్ రోజు రోజుకు తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రైజింగ్ తెలంగాణ అంటూ సంబరాలు ఎలా చేసుకుంటున్నారు. ఇక గద్వాల్ లో అయితే పురుషులు 49.8 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. అందులో మహిళల అక్షరాస్యత 39.4 శాతంగా ఉంది. కేతిదొడ్డి మండలంలో అయితే 33.77 శాతం అక్షరాస్యత ఉంటే అందులో మహిళలు 23 శాతమే. ఇక్కడ ఎంపీ అరుణమ్మ ఉన్న బీజేపీ బేటీ పడావో అంటోంది. మరి చదివిస్తున్నారో అర్థమైతలేదు. ఆవిడ సొంత జిల్లాలో కేతిదొడ్డి మండలంలో మహిళల అక్షరాస్యత 23 శాతం ఉంటే అరుణమ్మ గారు ఏం చేస్తున్నారు? నన్ను అయితే ఇన్నాళ్లు నిజామాబాద్ లో ఖైదీ చేశారు. ఇక్కడకు కొత్తగా వచ్చాను. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఒకటే కుటుంబం కదా ఇక్కడ రాజకీయాన్ని ఏలుతోంది? అని ప్రశ్నించారు. 

గద్వాల్ లో 3 వందల పడకల హాస్పిటల్ ఉన్నా ఉపయోగం లేదు

గద్వాల్ లో 3 వందల పడకల హాస్పిటల్ ఉన్నా ఉపయోగం లేదు.. వైద్యం కోసం కర్నూల్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అక్కడ ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోవటంతో ప్రజలు ప్రైవేట్ కు వెళ్తున్నారు. గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు.

ఆయన కాంగ్రెస్ లో ఉంటే సీఎంతో మాట్లాడి హాస్పిటల్ లో సౌకర్యాలు కల్పించాలి. ప్రతిపక్షంలో ఉంటే హాస్పిటల్ లో సౌకర్యాల కోసం ధర్నా చేయాలి. మీరు ఏమీ చేయకపోతే జాగృతి తరఫున ఆ పని మేము చేస్తామని మండిపడ్డారు.

Advertisement

తాజావార్తలు

Advertisement