త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hi Speed Rail | హైస్పీడ్ రైళ్ల‌తో.. హైద‌రాబాద్ నుంచి ఆ మూడు న‌గ‌రాల‌కు జెర్నీ టైం ఎంతంటే?

Hi Speed Rail | కేంద్ర బ‌డ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు (Hi Speed Rail) కారిడార్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. ఇందులో హైద‌రాబాద్‌కు (Hyderabad) మూడు హైస్పీడ్ రైళ్ల‌ను కేటాయించింది.

G

Telangana | Published On Feb 2, 2026, 8.40 am IST

Hi Speed Rail | హైస్పీడ్ రైళ్ల‌తో.. హైద‌రాబాద్ నుంచి ఆ మూడు న‌గ‌రాల‌కు జెర్నీ టైం ఎంతంటే?
Advertisement

Hi Speed Rail | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర బ‌డ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైలు (Hi Speed Rail) కారిడార్ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. ఇందులో హైద‌రాబాద్‌కు (Hyderabad) మూడు హైస్పీడ్ రైళ్ల‌ను కేటాయించింది. హైద‌రాబాద్‌-పుణె, హైద‌రాబాద్‌-చెన్నై, హైద‌ర‌బాద్‌-బెంగ‌ళూరు మ‌ధ్య ఎలివేటెడ్ ప‌ద్ధ‌తిలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు త‌ర‌హాలోనే ఈ కారిడార్ల‌ను నిర్మించ‌నున్నారు. త‌ద్వారా భాగ్య‌న‌గ‌రం నుంచి ఈ మూడు మెట్రో న‌గ‌రాల‌కు ప్ర‌యాణ స‌మ‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది. ఎంత అంటే చెన్నైకి 3 గంట‌లు, బెంగ‌ళూరు, పుణెకు 2 గంట‌ల్లోనే చేరుకోవ‌చ్చు. కాగా, గ‌తంలో ప్ర‌తిపాదించిన హైద‌రాబాద్-ముంబై కారిడార్‌ను.. హైద‌రాబాద్‌-పుణె, పుణె-ముంబైగా విభ‌జించారు. ఒక్కో ప్రాజెక్టు దాదాపు రూ.లక్షన్నర కోట్ల భారీ వ్యయంతో రూపొందనుడ‌టం గ‌మ‌నార్హం.

ప్రస్తుతం 13 గంటల చెన్నై ప్రయాణ సమయం మూడు గంటలకు, బెంగుళూరుకు 9 గంటలకు బదులు రెండు గంటల్లో, పుణెకు ఎనిమిది గంటలకు బదులు రెండు గంటలలోపు సమయంలోనే చేరుకోవచ్చు. ఇది రైలు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది.

హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌

ఈ రెండు ఐటీ రాజ‌ధానుల మ‌ధ్య దూరం 626 కిలోమీట‌ర్లు. హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌తిరోజూ వందేభార‌త్ రైలు న‌డుస్తున్న‌ది. దీని ప్ర‌యాణ స‌మ‌యం 8 గంట‌ల కంటే ఎక్కువ‌. అయితే కేంద్ర‌ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న హైస్పీడ్ కారిడార్ వ‌ల్ల ఈ స‌మ‌యం 2 గంట‌ల‌కు త‌గ్గ‌నుంది. దీనిని గతేడాది ప్రతిపాదించారు. 2025 సెప్టెంబ‌ర్‌లోనే సర్వే ప్రారంభించారు. ఎలివేటెడ్‌ పద్ధతిలో చేప‌ట్టే ఈ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.1.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

చెన్నైకి మూడు గంట‌ల్లోనే..

హైదరాబాద్‌–చెన్నై మ‌ధ్య 710 కిలోమీట‌ర్లు. ప్ర‌స్తుతం ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌యం 12 నుంచి 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. అయితే హైస్పీడ్ రైలుతో ఈ వ్య‌వ‌ధి కాస్తా 3 గంట‌ల‌కు చేరనుంది. కాగా, ఈ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ప్రతిపాదన రెండేళ్లుగా ఉంది. రైల్వే శాఖ ఏడాది క్రిత‌మే అలైన్‌మెంటును రూపొందించి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించింది. అయితే ప్ర‌భుత్వ అభ్యర్థన మేరకు అలైన్‌మెంట్‌ను సవరించి, తిరుపతి స్టేషన్‌ను చేర్చింది. దీనికి సంబంధించిన‌ ప్రాథమిక డీపీఆర్‌ను ఇప్ప‌టికే రూపొందించగా, తుది డీపీఆర్‌ను సిద్ధం చేయాల్సి ఉన్న‌ది.

హైద‌రాబాద్‌-పుణె కారిడార్‌..

ఇక మిగిలింది హైద‌రాబాద్‌-పుణె హైస్పీడ్ రైలు కారిడార్‌. దీనికి రైల్వే శాఖ గ‌తంలో శ్రీకారం చుట్టింది. మొద‌ట్లో హైద‌రాబాద్‌-ముంబై కారిడార్‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా సిద్ధ‌మైంది. అయితే అనంత‌రం దీనిని రెండుగా విభ‌జించి హైద‌రాబాద్‌-పుణె, పుణె-ముంబై కారిడార్లుగా మార్పు చేశారు. 760 కి.మీ.నిడివితో ఉండే ఈ ప్రాజెక్టు ద్వారా ముంబైకి 3 గంట‌ల్లోనే చేరుకోవ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్-ముంబై మ‌ధ్య న‌డిచే రైలు మార్గంలో 14 గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది. ఈ కారిడార్‌లో భాగంగా హైదరాబాద్, జహీరాబాద్, కలబురిగి, సోలాపూర్, పండరీపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కాంప్లెక్స్, బాంద్రా, ముంబై మొత్తం 11 స్టేష‌న్ల‌ను ప్ర‌తిపాదించారు. ఈ ప్రాజెక్టు వ‌ల్ల మహారాష్ట్ర, తెలంగాణలో 250–300 గ్రామాలు ప్రభావితం కానున్నాయి.

Advertisement
Advertisement