Jeevan Reddy | నేడు కేసీఆర్‌ను కలువనున్న జీవన్‌రెడ్డి.. పార్టీలో చేరికపై స్పష్టత
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) కలువనున్నారు. శుక్రవారం ఉదయం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ కానున్నారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత టీ.జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (KCR) కలువనున్నారు. శుక్రవారం ఉదయం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో భేటీ కానున్నారు. కాగా, గురువారం జగిత్యాలలో జీవన్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసిన తర్వాత పార్టీలో చేరికకు సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఆయనతోపాటు కేటీఆర్, గంగుల కమలాకర్, దామోదర్ రావు, కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ జిల్లా నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

కేసీఆర్‌తో జీవన్ రెడ్డి నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహం
జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లిన కేటీఆర్.. ఆయన పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌తో జీవన్ రెడ్డికి ఉన్న స్నేహం ఈ రోజుది కాదన్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా స్నేహం ఉంది. 2014లో కేసీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే అధికారిక పర్యటన ప్రారంభమైంది. ఇక్కడే ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత జీవన్ రెడ్డికి మైక్ ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. ఇక అభినందనలు చెప్పిన జీవన్ రెడ్డి.. మీరు గవర్నమెంట్‌లో ఉన్నారని చెప్పి.. జగిత్యాల ప్రజల తరపున బోర్నపల్లి గ్రామానికి బ్రిడ్జి కావాలని అడిగారు.
కేసీఆర్ దాటవేయకుండా.. జీవన్ రెడ్డి మీదున్న గౌరవంతో, ప్రేమతో క్షణంలోనే రూ. 75 కోట్లతో బ్రిడ్జిని మంజూరు చేశారు. ఇంకో సందర్భం గుర్తుకు వస్తుంది. రైతుల గురించి గట్టిగా మాట్లాడే నాయకుడు జీవన్ రెడ్డి. నిజాం షుగర్స్ ఇంపార్టెంట్ సబ్జెక్టు.. తెరిపించాలని కొట్లాడేవారు. తెరిపిస్తాం కానీ.. మహారాష్ట్రలో సహకార వ్యవస్థలో అక్కడ షుగర్ మిల్లులు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. కోఆపరేటివ్ సిస్టమ్ అమలు చేస్తే బాగుంటుందని నిండు శాసనసభలో జీవన్ రెడ్డికి కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉంది.. మీరు చైర్మన్‌గా ఉండాలని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



