త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vaakiti Srihari | ఒక్క మోటార్ బిగిస్తే అయిపోయినట్లేనా? పాల‌మూరు ప్రాజెక్టుపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం: వాకిటి

Vaakiti Srihari | పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని, ఒక్క మోటార్ బిగిస్తే మొత్తం అయిపోయినట్లా? అని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి ప్ర‌శ్నించారు. ఎక్క‌డైనా స‌రే పాలమూరు ప్రాజెక్ట్ పై చర్చకు మా ఎమ్మెల్యే లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు.

S

Telangana | Published On May 19, 2026, 4.20 pm IST

Vaakiti Srihari | ఒక్క మోటార్ బిగిస్తే అయిపోయినట్లేనా? పాల‌మూరు ప్రాజెక్టుపై ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం: వాకిటి
Advertisement
  • మేమొచ్చాక నాలుగు పంపులు బిగించాం
  • రాష్ట్రంలో, దేశంలో ప్రాజెక్టులు క‌ట్టిందే కాంగ్రెస్‌
  • పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయ‌మ‌ని సీఎం రేవంత్ చెప్పారు
  • ప్ర‌తిప‌క్ష నేత‌లు ఇంకా భ్ర‌మ‌ల్లోనే ఉన్నారు
  • అప్పుడు పాల‌మూరు పేరు వాడుకొని గెలిచారు
  • ఇప్పుడు ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని న‌మ్మే ప‌రిస్థితి లేదు
  • పాల‌మూరు ప్ర‌జ‌లు అమాయ‌కులే.. కానీ మీ మాట‌లు న‌మ్మేంత‌ అవివేకులు కారు
  • బీఆర్ఎస్‌పై మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి విమ‌ర్శ‌లు

Vaakiti Srihari | త్రినేత్ర‌.న్యూస్‌: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని, ఒక్క మోటార్ బిగిస్తే మొత్తం అయిపోయినట్లా? అని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి ప్ర‌శ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పై సీఎల్ పీలో మంత్రులు, ఎమ్మెల్యే లతో క‌లిసి ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రజలు అమాయకులేన‌ని.. కానీ మీ మాట‌లు న‌మ్మేంత అవివేకులు కార‌ని అన్నారు. ఎక్క‌డైనా స‌రే పాలమూరు ప్రాజెక్ట్ పై చర్చకు మా ఎమ్మెల్యే లు సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. పాలమూరు రంగారెడ్డిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

పొర్లు దండాలు పెట్టినా ప్ర‌జ‌లు న‌మ్మ‌రు..

21 ప్యాకేజీలతో జీవో ఇచ్చి 18 ప్యాకేజీలతో సరిపెట్టారు. భ్రమల నుండి ప్రతిపక్ష నేతలు బయటికి రావాలి. మీరు పోరు బాట కాదు కదా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్ములను నమ్మే పరిస్థితి లేదు. కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణా నది ప్రారంభ‌మ‌య్యేది మా మక్తల్ లోనే. పక్కన ఉన్న 12 కిలోమీటర్ల నుండి తెచ్చే నీటిని 300 కిలోమీటర్ లు తిప్పి తెస్తాం అని వాకిటి చెప్పారు.

ఓడిపోయినా కండ్లు తెరుస్త‌లేరు..

గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా మీకు కనువిప్పు కలగలేదు. ఆనాడు పాలమూరు ప్రాజెక్ట్ కు డబ్బులు ఇవ్వకుంటే అప్పుడున్న బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అడగలేదు. ఈ దేశంలో రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు కట్టిందే కాంగ్రెస్డ్ పార్టీ. ప్రాజెక్ట్ ల పేరుతో బీఆర్ఎస్ నేతలు డబ్బులు దండుకున్నారు. పాలమూరు పేరు వాడుకొని మీరు ఆనాడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు పాలమూరు ప్రజల విశ్వాసం కోల్పోయి అధికారం పోగొట్టుకున్నారు అని మంత్రి అన్నారు.

మేము వచ్చాక 4 పంపులు బిగించాం. భూ నిర్వాసితులకు ఇప్పటికీ నష్ట పరిహారం ఇవ్వలేదు. రైతు ఈ దేశానికి వెన్నెముక. మీరు పోరుబాట చేస్తే పాలమూరు ప్రజలు మిమ్మ‌ల్ని నీలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మా సహచర ఎమ్మెల్యే లు పాలమూరు ప్రాజెక్ట్ పై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని మంత్రి వాకిటి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement