త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bus Bhavan | బస్ భవన్‌లో పాగా వేసిన ఐటీ, జీఎస్టీ అధికారులు

Bus Bhavan | హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న బ‌స్ భ‌వ‌న్‌లో ఐటీ, జీఎస్టీ అధికారులు పాగా వేశారు. ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే బ‌స్ భ‌వ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు.

S

Telangana | Published On Apr 1, 2026, 4.56 pm IST

Bus Bhavan | బస్ భవన్‌లో పాగా వేసిన ఐటీ, జీఎస్టీ అధికారులు
Advertisement

Bus Bhavan | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న బ‌స్ భ‌వ‌న్‌లో ఐటీ, జీఎస్టీ అధికారులు పాగా వేశారు. ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌కుండానే బ‌స్ భ‌వ‌న్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనూహ్యంగా ఆర్టీసీ కార్యాల‌యాల తాళాలు ప‌గుల‌గొట్టి.. వాటిని స్వాధీనం చేసుకోవ‌డంతో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు నాలుగు ఫ్లోర్లను కేటాయించిందని ఐటీ, జీఎస్టీ అధికారులు చెబుతున్న‌ట్లు స‌మాచారం. ఏ బ్లాక్‌లో ఉన్న నాలుగు ఫ్లోర్‌లు త‌మ‌కు కేటాయించిన‌ట్లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జీవో ఇచ్చార‌ని జీఎస్టీ అధికారులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళ‌న‌..

విలీనం కాక‌ముందే ప్ర‌భుత్వ ఆధీనంలోకి బ‌స్ భ‌వ‌న్, ఆర్టీసీ ఆస్తులను స్వాధీనం చేసుకోవ‌డంతో.. ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల‌ను, కార్మికుల‌ను రోడ్డున ప‌డేసే కుట్ర జ‌రుగుతుంద‌ని రేవంత్ స‌ర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నారు. కార్పొరేష‌న్ కింద ఉన్న బ‌స్ భ‌వ‌న్‌పై ప్ర‌భుత్వం అజమాయిషీ ఏంటంటూ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఉద్యోగులు, ఆర్టీసీ ఆస్తులన్నీ కార్పొరేషన్ కింద ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారని ప్ర‌శ్నిస్తున్నాయి. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై గురువారం పెద్ద ఎత్తున స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకుండా ఏకపక్షంగా ఆర్టీసీ ఆస్తులు ఎలా ఉపయోగించుకుంటారని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement