త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rain Alert | తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Rain Alert | తెలంగాణ‌లో రానున్న ఐదురోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఉత్త‌ర‌, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

P

Telangana | Published On Jun 14, 2026, 7.36 pm IST

Rain Alert | తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. అలెర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం
Advertisement

Rain Alert | తెలంగాణ‌లో రానున్న ఐదురోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఉత్త‌ర‌, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. భారీగా ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌ని, దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల‌ని సూచించింది.

ఇక సోమ‌వారం నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఉంటుంద‌ని.. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయ‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం నుంచి బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వాన‌లు ప‌డుతాయ‌ని, ఈదురుగాలులు కొనసాగవచ్చని తెలిపింది. బుధ‌వారం నుంచి గురువారం ఉద‌యం వ‌ర‌కు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్య తెలంగాణలో కూడా అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేసింది.

గురువారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వాన‌లు ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. ఇక నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చురుగ్గా ఉన్నాయ‌ని.. రాగ‌ల నాలుగురోజుల్లో మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రిస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ తెలిపింది. ప‌శ్చిమ బంగాళాఖాతం నుంచి ద‌క్షిణ కోస్తా నుంచి త‌మిళ‌నాడు వ‌ర‌కు నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి కొన‌సాగుతోంద‌ని, స‌గ‌టున స‌ముద్ర‌మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల నుంచి 4.5 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కు ఉంద‌ని వివ‌రించింది.

Advertisement
Advertisement