త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ఎప్ప‌టికీ పార్టీ త‌ల‌వంచే ప‌ని చేయను.. కంట‌త‌డి పెట్టిన బండి సంజ‌య్‌

Bandi Sanjay | పార్టీ త‌ల‌వంచే ప‌ని తాను ఎప్పుడూ చేయ‌న‌ని, రాజ‌కీయంగా త‌న‌ను ఎదుర్కోలేకే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ ఆవేద‌న చెందారు. తెలంగాణ‌లో వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మే అని చెప్పారు.

S

Telangana | Published On May 10, 2026, 6.27 pm IST

Bandi Sanjay | ఎప్ప‌టికీ పార్టీ త‌ల‌వంచే ప‌ని చేయను.. కంట‌త‌డి పెట్టిన బండి సంజ‌య్‌
Advertisement
  • భ‌య‌ప‌డ‌డానికి నేను ఫామ్‌హౌస్‌లో ఎలుక‌ను కాదు
  • రాజ‌కీయంగా ఎదుర్కోలేకే నాపై త‌ప్పుడు ఆరోప‌ణలు
  • ప‌రేడ్ గ్రౌండ్ స‌భ‌లో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి భావోద్వేగం

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ త‌ల‌వంచే ప‌ని తాను ఎప్పుడూ చేయ‌న‌ని, రాజ‌కీయంగా త‌న‌ను ఎదుర్కోలేకే త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నారని కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ ఆవేద‌న చెందారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వ‌హించిన మోదీ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. తెలంగాణ‌లో వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మే అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కంట‌త‌డి పెట్టుకున్నారు.

జై  శ్రీ‌రాం అంటే కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. ఆరు గ్యారంటీలు అమ‌లు గాలికొదిలేశారు. మా ధ‌ర్మాన్ని కించ‌ప‌రిస్తే ఊరుకోం. రాముడిని అవ‌మానిస్తే స‌హించం. స‌నాత‌న ధ‌ర్మం కోసం మేం ప‌ని చేస్తున్నం. త‌ప్పు చేసేవారిని వ‌దిలిపెట్టం. ప‌శ్చిమ బెంగాల్ లో బీజేపీ అంత‌ ఈజీగా గెల‌వ‌లేదు. ప్ర‌తిఒక్క కార్య‌క‌ర్త‌, నాయ‌కులు క‌ష్ట‌ప‌డితేనే ఫ‌లితాలు సానుకూలంగా వ‌చ్చాయి. నిధులు ఇచ్చేది మ‌నం, అభివృద్ధి చేసేది మ‌నం. భ‌య‌ప‌డ‌డానికి నేను ఫామ్‌హౌజ్‌లో ఎలుక‌ను కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజ‌కీయాల్లోకి రాలేదు అని బండి పేర్కొన్నారు.

మేం నిధులిస్తే కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీకి పంపుతున్నారు..

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. జై శ్రీరామ్ నినాదంతోనే గడీల కోటలు బద్ధలుకొట్టాం. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. తాము తెలంగాణకు నిధులిస్తుంటే, కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి నిధులు పంపుతున్నారు అని బండి సంజ‌య్ విమర్శించారు.

Advertisement
Advertisement