త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KAVITHA | పిలిస్తే సిట్ విచారణకు వెళ్లి స‌హ‌క‌రిస్తా – క‌ల్వ‌కుంట్ల క‌విత

పిలిస్తే సిట్ విచారణకు తాను వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సిట్ విచారణపై కేటీఆర్ తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

S

Telangana | Published On Feb 2, 2026, 1.47 pm IST

KAVITHA | పిలిస్తే సిట్ విచారణకు వెళ్లి స‌హ‌క‌రిస్తా – క‌ల్వ‌కుంట్ల క‌విత
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌ : పిలిస్తే సిట్ విచారణకు తాను వెళ్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సిట్ విచారణపై కేటీఆర్ తప్పుగా మాట్లాడటం సరికాదన్నారు. చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. గుంటనక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతందని మండిపడ్డారు. నాతో పాటు నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు అనుమానాలున్నాయన్నారు. పిలిస్తే క‌చ్చితంగా విచార‌ణ‌కు వెళ్లి స‌హ‌క‌రిస్తాన‌ని పేర్కొన్నారు. విచార‌ణ అనంత‌రం నిజ‌మైన దోషులు బ‌య‌ట‌కొస్తార‌ని, త్వ‌ర‌గా విచార‌ణ‌ను ముగించి దోషుల‌కు శిక్ష ప‌డేలా చూడాల‌న్నారు. సిట్ విచార‌ణ‌లో ఏం జ‌రిగిందో మాజీ సీఎం కేసీఆర్ చెప్తార‌ని భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

 



ట్యాగ్స్:

Advertisement
Advertisement