OBC Declaration | 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించాలి
OBC Declaration | బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను తీసేయాలని ఓబీసీ డిక్లరేషన్( OBC Declaration ) డిమాండ్ చేసింది. 50 సీలింగ్ కారణంగా బీసీలకు నష్టం జరుగుతుందని పేర్కొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి..
ఓబీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలి
బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి
హైదరాబాద్ ఓబీసీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం
OBC Declaration | త్రినేత్ర న్యూస్ : బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను తీసేయాలని ఓబీసీ డిక్లరేషన్( OBC Declaration ) డిమాండ్ చేసింది. 50 సీలింగ్ కారణంగా బీసీలకు నష్టం జరుగుతుందని పేర్కొంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించి బ్యాక్ లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన తగిన వాటా కల్పించాలని హైదరాబాద్‌లో జరిగిన ఓబీసీ డిక్లరేషన్ సభ డిమాండ్ చేసింది. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఈ సభలో బీసీ డిక్లరేషన్‌లోని పలు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
సభలో ఆమోదించిన డిక్లరేషన్‌లోని ముఖ్యమైన అంశాలు ఇవీ:
- దేశమంతటా కులగణన చేపట్టి, ఓబీసీల వివరాల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి.
- ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలి.
- ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో జనాభా నిష్పత్తికి అనుగుణంగా వాటా కల్పించాలి.
- 1931 జనాభా లెక్కల ప్రకారం బీసీల జనాభా 52 శాతంగా ఉందని పేర్కొంటూ, అందుకు అనుగుణంగా 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిక్లరేషన్‌లో డిమాండ్ చేశారు.
- రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించాలని, ఈ పరిమితి వల్ల బీసీలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
- బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి.
- ఉన్నత విద్యా సంస్థల్లో సామాజిక న్యాయం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
- ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలి.
- తెలంగాణలో 42 శాతం, మధ్యప్రదేశ్‌లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిక్లరేషన్‌లో కోరారు.
సంబంధిత వార్తలు

Errolla Srinivas | బూతు పురాణాలకు గాంధీ భవన్ అడ్డాగా మారింది : ఎర్రోళ్ల శ్రీనివాస్
అక్టోబర్ 28, 2026

Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బతకడానికి చావడానికి కాదు
అక్టోబర్ 28, 2026

Harish Rao | ప్రతిపక్ష నేతలను నిర్బంధిస్తూ.. ఎమర్జెన్సీ తరహా పాలన సాగించడం సిగ్గుచేటు: హరీశ్ రావు
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు
- ●Shraddha Kapoor | ప్రసవ వేదనలోనూ నాట్యమే ప్రాణం!.. 29న శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్
- ●Errolla Srinivas | బూతు పురాణాలకు గాంధీ భవన్ అడ్డాగా మారింది : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Savings Account | సేవింగ్స్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే.. ఏడాదికి ఎంత వడ్డీ వస్తుంది..?
- ●Supreme Court | సైబర్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాల్సిందే.. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●Eatala Rajender | గాలి పీల్చేది, నీళ్ళు తాగేది బతకడానికి చావడానికి కాదు

Banjara Hills SI Vijay Arrest | చీటింగ్ కేసులో అరెస్ట్ చేయను కానీ.. 10 లక్షలు ఇవ్వు

Shraddha Kapoor | ప్రసవ వేదనలోనూ నాట్యమే ప్రాణం!.. 29న శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్

Errolla Srinivas | బూతు పురాణాలకు గాంధీ భవన్ అడ్డాగా మారింది : ఎర్రోళ్ల శ్రీనివాస్

Savings Account | సేవింగ్స్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే.. ఏడాదికి ఎంత వడ్డీ వస్తుంది..?



