త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Municipal Elections | ఈ మున్సిపాలిటీల్లో హంగ్‌.. ఏ పార్టీకి ద‌క్క‌ని మ్యాజిక్ ఫిగ‌ర్‌

Municipal Elections | మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో అత్య‌ధిక పుర‌పాల‌క సంఘాల‌ను అధికార‌పార్టీ ద‌క్కించుకున్న‌ది. ప‌లుచోట్ల బీఆర్ఎస్ విజ‌యం సాధించింది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ (Hung) ఏర్ప‌డంది. ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన మెజార్టీ (Majority Mark) ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ (Magic Figure) దాట‌లేక‌పోయాయి.

G

Telangana | Published On Feb 13, 2026, 1.17 pm IST

Municipal Elections | ఈ మున్సిపాలిటీల్లో హంగ్‌.. ఏ పార్టీకి ద‌క్క‌ని మ్యాజిక్ ఫిగ‌ర్‌
Advertisement

Municipal Elections | త్రినేత్ర.న్యూస్‌: మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Municipal Elections) ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలోని మొత్తం 116 మున్సిపాలిటీల్లో అత్య‌ధిక పుర‌పాల‌క సంఘాల‌ను అధికార‌పార్టీ ద‌క్కించుకున్న‌ది. ప‌లుచోట్ల బీఆర్ఎస్ విజ‌యం సాధించింది. అయితే ఆసిఫాబాద్‌, క్యాతనపల్లి, అమరచింత, దేవరకద్ర, అలంపూర్‌, కేసముద్రం, కోహిర్‌, జ‌హీరాబాద్‌, దేవ‌ర‌కొండ, జ‌న‌గామ‌, జిన్నారం, జ‌మ్మికుంట‌, వేముల‌వాడ‌, రాయిక‌ల్ స‌హా ప‌లు మున్సిపాలిటీల్లో హంగ్ (Hung) ఏర్ప‌డంది. ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన మెజార్టీ (Majority Mark) ఇవ్వ‌క‌పోవ‌డంతో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగ‌ర్ (Magic Figure) దాట‌లేక‌పోయాయి. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో చైర్మ‌న్ ఎన్నిక‌కు ఎక్స్​అఫీషియో (Ex-Officio) సభ్యుల ఓట్లు త‌ప్ప‌నిస‌రి కానున్నాయి.

ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్‌ ఫిగర్ ద‌క్క‌లేదు. అక్క‌డ బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ స‌గానికిపైగా వార్డుల్లో గెల‌వ‌లేక‌పోయింది. మున్సిపాలిటీలోని మొత్తం 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 9, కాంగ్రెస్‌ 7, ఇతరులు 4 స్థానాల్లో విజ‌యం సాధించారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ల‌భించ‌లేదు. ప‌ట్ట‌ణంలోని మొత్తం 22 వార్డుల్లో కాంగ్రెస్‌ 7, బీఆర్‌ఎస్‌ 10, బీజేపీ 1, ఇతరులు 4 వార్డుల్లో విజ‌యం సాధించారు.

ఇక ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది. వ‌నపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్ దాట‌లేక‌పోయాయి. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్‌ 3, బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 3, ఇతరులు 1 చోట గెలుపొందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్రలోని 12 వార్డుల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, బీజేపీ 1, ఇతరులు 1 చొప్పున విజ‌యం సాధించారు. జోగులాంబ జిల్లాలోని గ‌ద్వాలలో మొత్తం 37 వార్డుల‌కు గాను కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇత‌రులు 3 చోట్ల విజ‌యం సాధించారు. అలంపూర్‌లోనూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో ఐదు చొప్పున వార్డుల‌ను గెలుచుకున్నాయి.

మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో ఏ పార్టీకి దక్కని మ్యాజిక్‌ ఫిగర్ రాలేదు. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కాంగ్రెస్‌ 8, బీఆర్‌ఎస్ 8 చొప్పున గెలుపొందాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌, జ‌హీరాబాద్‌లోనూ ప్ర‌జ‌లు ఎవ‌రికీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఇవ్వ‌లేదు. కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డుల‌కు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5, బీజేపీ, ఎంఐఎం, స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక్కో చోట విజ‌యం సాధించారు. జ‌హీరాబాద్‌లో 37 స్థానాల‌కు గాను అత్య‌ధికంగా బీఆర్ఎస్‌కు 15 వార్డులు, కాంగ్రెస్ 14, బీజేపీ 3, స్వ‌తంత్రులు 3, ఎంఐఎం 2 వార్డుల్లో గెలుపొందాయి.

ఇక న‌ల్ల‌గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌లోనూ ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప‌ట్ట‌ణంలోని మొత్తం 20 వార్డుల్లో 10 చోట్ల గెలిచిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన‌ప్ప‌టికీ మెజార్టీ మార్కును దాట‌లేక‌పోయింది. బీఆర్ఎస్ 7, బీజేపీ 1, ఇత‌రులు 2 వార్డుల్లో గెలుపొందారు.

క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట మున్సిపాలిటీలో 30 వార్డుల‌కుగాను కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, ఇత‌రులు 7 చోట్ల విజ‌యం సాధించారు. మెజార్టీ మార్కు దాటాలంటే 16 వార్డుల్లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది. వేముల‌వాడ‌లో 28 వార్డులు ఉండ‌గా కాంగ్రెస్ 13 చోట్ల విజ‌యం సాధించింది. ఇక బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇత‌రులు 2 చోట్ల గెలుపొందారు. జగిత్యాల జిల్లా రాయిక‌ల్‌లో 12 వార్డుల‌కుగాను కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చెరో 3 చోట్ల‌, బీజేపీ 5, ఇత‌రులు 1 వార్డులో గెలుపొందారు.

కాగా, రాష్ట్రంలోని 116 పురపాలికల్లో ఉన్న‌ 2582 వార్డుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 1743 చోట్ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. వాటిలో కాంగ్రెస్ 926 వార్డుల్లో విజ‌యం సాధించ‌గా, బీఆర్ఎస్ 492, బీజేపీ 169, ఇత‌రులు 162 చోట్ల గెలుపొందారు.

Advertisement
Advertisement