త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Metro | ఆర్టీసీ స‌మ్మె.. ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిన‌ మెట్రో రైళ్లు

Hyderabad Metro | రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స‌మ్మె (RTC Strike) కొనసాగుతున్న‌ది. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగ‌డంతో డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు క‌ద‌ల్లేదు. దీంతో హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల‌లో (Hyderabad Metro) ఒక్కసారిగా ర‌ద్దీ పెరిగిపోయింది.

G

Telangana | Published On Apr 22, 2026, 11.55 am IST

Hyderabad Metro | ఆర్టీసీ స‌మ్మె.. ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిన‌ మెట్రో రైళ్లు
Advertisement

Hyderabad Metro | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ స‌మ్మె (RTC Strike) కొనసాగుతున్న‌ది. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిర‌వ‌ధిక స‌మ్మెకు దిగ‌డంతో డిపోల నుంచి బ‌స్సులు బ‌య‌ట‌కు క‌ద‌ల్లేదు. దీంతో హైద‌రాబాద్‌లో మెట్రో రైళ్ల‌లో (Hyderabad Metro) ఒక్కసారిగా ర‌ద్దీ పెరిగిపోయింది. ప్ర‌యాణికులతో మెట్రో స్టేష‌న్లు కిక్కిరిసిపోయాయి. పెద్ద సంఖ్య‌లో ప్ర‌యాణికులు టికెట్ల కోసం మెట్రో స్టేష‌న్ల‌లో క్యూలైన్ల‌లో నిల్చున్నారు. ఎల్బీన‌గ‌ర్‌, అమీర్‌పేట వంటి కీల‌క స్టేష‌న్ల‌లో టికెట్ కౌంట‌ర్లు, ప్లాట్‌ఫార‌మ్‌ల‌పై భారీ క్యూలైన్లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో అధికారులు అద‌న‌పు స‌ర్వీసులు న‌డుపుతున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బ‌స్సులు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. హైద‌రాబాద్ స‌హా ప‌లు డిపోల్లో అద్దె బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ప్ప‌టికీ అవి ప్ర‌యాణికుల‌కు ఏమాత్రం స‌రిపోవ‌డం లేదు. దీంతో జ‌నం ప్రైవేటు వాహ‌నాలను ఆశ్ర‌యిస్తున్నారు. ఇదే అద‌నుగా ఆటో డ్రైవ‌ర్లు, సెట్‌విన్ స‌ర్వీసుల నిర్వాహ‌కులు అద‌న‌పు డ‌బ్బును డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Advertisement