త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ క్లియర్‌

Ibrahimpatnam | రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు (Municipal Chairman) లైన్ క్లియ‌ర్ అయింది. చైర్మన్‌ ఎన్నికలో తుది నిర్ణయం ఆర్వోదేనని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది.

G

Telangana | Published On Feb 18, 2026, 1.25 pm IST

Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ క్లియర్‌
Advertisement

Ibrahimpatnam | త్రినేత్ర‌.న్యూస్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికకు (Municipal Chairman) లైన్ క్లియ‌ర్ అయింది. చైర్మన్‌ ఎన్నికలో తుది నిర్ణయం ఆర్వోదేనని హైకోర్టు (High Court) స్పష్టం చేసింది. 19వ వార్డు బీఆర్​ఎస్​ కౌన్సిలర్ ఆకుల యాదగిరిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని జిల్లా కలెక్టర్‌, పోలీసులను ఆదేశించింది. యాదగిరి స్వచ్ఛందంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై (Habeas Corpus petition) విచారణ ముగించింది. యాదగిరి కనిపించడం లేదంటూ ఆయన కుమారుడు హరికాంత్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ నె 18న ఆయ‌న‌ను కోర్టు ముందు హాజ‌రుప‌ర‌చాల‌ని రెండు రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో యాదగిరిని హైకోర్టు జడ్జి ముందు పోలీసులు హాజరుపచ్చారు. ఈ సంద‌ర్భంగా ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత‌ బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డి మనుషులు తనని బలవంతంగా చీరాల‌ తీసుకెళ్లారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రెండు రోజులు రిసార్ట్‌లోనే ఉంచారన్న తెలిపారు.

కాగా, ఇబ్ర‌హీంప‌ట్నం మున్సిప‌ల్ చైర్మ‌న్ ఎన్నిక ర‌సాభాస‌గా మారిన విష‌యం తెలిసిందే. త‌న తండ్రి క‌నిపించ‌డం లేదంటూ యాద‌గిరి కుమారుడు, కుటుంబ స‌భ్యులు మున్సిపాలిటీ ఎదుట ఈ నెల 16న‌ ఆందోళ‌న నిర్వ‌హించారు. మున్సిప‌ల్ కార్యాల‌యంపై రాళ్ల‌తో దాడిచేశారు. దీంతో చైర్మ‌న్ ఎన్నిక వాయిదాప‌డింది. అయితే మ‌రుస‌టి రోజుఅనూహ్యంగా ఉదయం బీఆర్ఎస్ క్యాంపులో కౌన్సిల్‌ ఎన్నికకు యాదగిరి హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక పూర్తయిన తర్వాత అధికారులకు కోర్టు ఆదేశాలు అందాయి. దీంతో మున్సిపల్ చైర్మన్‌ ఎన్నికను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. స్టే కారణంగా బీఆర్‌ఎస్ చైర్మన్‌ అభ్యర్థికి ధ్రువీకరణపత్రం ఇవ్వలేదు.

Advertisement
Advertisement