త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..: హ‌రీశ్ రావు

Harish Rao | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది త్యాగాల చ‌రిత్ర‌కు న్యాయం జ‌రిగిన రోజు అని, అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు అని చెప్పారు.

G

Telangana | Published On Jun 2, 2026, 7.54 am IST

Harish Rao | తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీఆర్ఎస్ ఎల్పీ ఉప‌నేత హ‌రీశ్ రావు (Harish Rao) శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇది త్యాగాల చ‌రిత్ర‌కు న్యాయం జ‌రిగిన రోజు అని, అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు అని చెప్పారు. కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంద‌ని తెలిపారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షించారు.

`త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.

కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.` అని హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement