త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు.. ప‌రేడ్ గ్రౌండ్స్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

Traffic Restrictions | తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి 12 ఏండ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల‌ను (Telangana Formation Day) ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ది.

G

Hyderabad | Published On Jun 2, 2026, 7.09 am IST

Traffic Restrictions | తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు.. ప‌రేడ్ గ్రౌండ్స్ ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..
Advertisement

Traffic Restrictions | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి 12 ఏండ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌ల‌ను (Telangana Formation Day) ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న‌ది. సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్స్ (Parade Ground) ఈ సంబురాల‌కు వేదిక‌గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు జాతీయ జెండా ఎగుర‌వేస్తారు. ఈ నేప‌థ్యంలో ప‌రేడ్ గ్రౌండ్స్, ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు (Traffic Restrictions) విధించారు. ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌లులో ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్నారు. దీంతో బేగంపేట, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయిన్‌ప‌ల్లి, ట్యాంక్‌బండ్ వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపులు ఇలా..

ట్యాంక్‌బండ్ నుంచి తిరుమ‌ల‌గిరి వైపు వెళ్లే వాహ‌నాల‌ను ప్యార‌డైజ్‌, సీడీవో, తాడ్‌బండ్‌, డైమండ్‌పాయింట్‌, బోయిన్‌ప‌ల్లి మార్కెట్ మీదుగా మ‌ళ్లిస్తారు.

తిరుమ‌ల‌గిరి నుంచి ట్యాంక్‌బండ్ వైపు వ‌చ్చేవారు ఎన్‌సీసీ, పికెట్‌, స్వీకార్ ఉప్‌కార్‌, వైఎంసీఏ, క్లాక్‌ట‌వ‌ర్‌, ప్యాట్నీ, ఘాస్‌మండి, క‌ర్బాలా రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది.

సికింద్రాబాద్ నుంచి తిరుమ‌ల‌గిరి వెళ్లేవారు క్లాక్‌ట‌వ‌ర్‌, సంగీత్‌, సెయిన్ జాన్స్ రోట‌రీ, ఏఓసీ, కేవీ రూట్ మీదుగా

బోయిన్‌ప‌ల్లి వైపు..

బోయిన్‌ప‌ల్లి వైపు వెళ్లాలంటే ప్యాట్నీ, ప్యార‌డైజ్‌, సీటీవో మీదుగా, బోయిన్‌ప‌ల్లి వైపు నుంచి సికింద్రాబాద్‌ వ‌చ్చేవారు బ్రూక్‌బాండ్‌, టివోలి, స్వీకార్ ఉప్‌కార్‌, వైఎంసీఏ మార్గంలో ప్ర‌యాణించాలి.

 

Advertisement
Advertisement