త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక బీఆర్ఎస్: హరీశ్ రావు

Harish Rao | ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్‌ఎస్ (BRS) అని హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. పోరాటాల పునాదిపై పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి గులాబీ పార్టీ అనిచెప్పారు.

G

Telangana | Published On Apr 27, 2026, 10.52 am IST

Harish Rao | సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక బీఆర్ఎస్: హరీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ బీఆర్‌ఎస్ (BRS) అని హ‌రీశ్ రావు (Harish Rao) అన్నారు. పోరాటాల పునాదిపై పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి గులాబీ పార్టీ అనిచెప్పారు. నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదంటూ.. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు.

`నాలుగు కోట్ల గొంతులను ఏకం చేసి విప్లవ శంఖం మోగించిన ధిక్కార వేదిక,
సమైక్య సంకెళ్లను తెంచి స్వరాష్ట్ర కాంక్షను సాకారం చేసిన యుద్ధ గీతిక,
పదేళ్ల పాలనతో ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దిన అభివృద్ధి పతాక,
తెలంగాణ జాతి ఆత్మగౌరవ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గులాబీ దీపిక,
ప్రజల విశ్వాసానికి ప్రతీక, ప్రజా ఉద్యమ పతాక.. భారత రాష్ట్ర సమితి 26 వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

పాపపు పాలనలో ప్రజల జీవితాలు నలిగిపోతున్న వేళ, ప్రజల గుండెల్లో మార్మోగుతున్నది ఒక్కటే నినాదం..
సంక్షేమం అడుగంటి, అభివృద్ధి నిలిచిపోయి, అరాచకం తాండవం చేస్తున్న కాలంలో వినిపిస్తున్నది ఒక్కటే ఆవాజ్‌..
"రేవంత్ పోవాలి… కేసీఆర్ రావాలి”

ఉద్యమంలోనైనా, అధికారంలోనైనా, ప్రతిపక్షంలోనైనా
ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడి, తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్న పార్టీ మన బీఆర్‌ఎస్.
పోరాటాల పునాది మీద పుట్టి, ప్రజల విశ్వాసంతో ఎదిగి, ప్రతి గుండెలో నాటుకుపోయిన గులాబీ శక్తి మన బీఆర్‌ఎస్.

గులాబీ జెండా సగర్వంగా ఎగిరే రోజు ఎంతో దూరంలో లేదు,
నిలిచిపోయిన తెలంగాణ ప్రగతి రథం మళ్లీ పరుగులు తీసే రోజు ఎంతో దూరంలో లేదు.

జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్‌ఎస్.` అని హ‌రీశ్ రావు ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement