త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao vs Revanth Reddy | సీఎం రేవంత్ చెత్త బుద్ధి మారదు.. నోటి మురికి పోదు : హరీశ్ రావు

అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై, రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అని హరీశ్ రావు మండిపడ్డారు.

J

Telangana | Published On Feb 2, 2026, 8.09 pm IST

Harish Rao vs Revanth Reddy | సీఎం రేవంత్ చెత్త బుద్ధి మారదు.. నోటి మురికి పోదు : హరీశ్ రావు
Advertisement

Harish Rao vs Revanth Reddy |సీఎం రేవంత్ రెడ్డి జాతిపిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మండిపడ్డారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హితబోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారన్నారు.

  • హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు. కేసీఆర్ గారిపై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారు. హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు
  • అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదు. కనీస సంస్కారం రాలేదు, చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి.
  • దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతి పితనే రేవంత్ రెడ్డి. నాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుంది? ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి?
  • అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై, రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి? లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎలా అర్థం అవుతాయి రేవంత్ రెడ్డి? నువ్వు అమెరికా లోని హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టం.
Advertisement
Advertisement