త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad Ganja Gang Attack | నిజామాబాద్‌లో గంజాయి ముఠా బరితెగింపు: మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

నిజామాబాద్ శివారులో గంజాయి ముఠా అరాచకానికి తెగబడింది. తనిఖీలు చేస్తున్న మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

J

Nizamabad | Published On Jan 24, 2026, 10.51 am IST

Nizamabad Ganja Gang Attack | నిజామాబాద్‌లో గంజాయి ముఠా బరితెగింపు: మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

సంక్షిప్త సారాంశం

నిజామాబాద్‌లో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకున్న ఎక్సైజ్ పోలీసులపై దాడి జరిగింది. కారు ఆపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను నిందితులు కారుతో ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పోలీసులు వెంబడించి ఇద్దరు నిందితులను పట్టుకుని 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Nizamabad Ganja Gang Attack | జిల్లాలో గంజాయి గ్యాంగ్ బరితెగించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులపైనే భౌతిక దాడికి దిగారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగిందంటే?

నిజామాబాద్ నగర శివారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న ఒక కారును గుర్తించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య.. దానిని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూడగానే నిందితులు భయపడకుండా.. తప్పించుకునే క్రమంలో కారును నేరుగా సౌమ్యపైకి పోనిచ్చారు.

తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో

కారు బలంగా ఢీకొట్టడంతో సౌమ్య గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సహచర సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను నిజామాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వెంటాడి పట్టుకున్న పోలీసులు

కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన తర్వాత నిందితులు కారులో వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఎక్సైజ్ పోలీసులు సినిమా ఫక్కీలో వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను (ఒకరు మైనర్ అని సమాచారం) అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని, రవాణాకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మహమ్మద్ సొఫియొద్దీన్, సయ్యద్ షోయల్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. వీరి వెనుక ఉన్న గంజాయి నెట్‌వర్క్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై ఇలాంటి దాడి జరగడంపై పోలీస్ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement