Irrigation Water | వరి ఎండిపోతుంది.. ట్యాంకర్‌కు 500 ఇచ్చి నీళ్లు పారిస్తున్న
Irrigation Water | తెలంగాణ రాష్ట్రంలో సాగు నీటి కొరత (Irrigation Water Problem) ఎలా ఉందో చెప్పడానికి నాగర్‌కర్నూలు (Nagar Kurnool) జిల్లాలోని ఓ రైతు దుస్థితి అద్దం పడుతున్నది.
Irrigation Water | త్రినేత్ర న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సాగు నీటి కొరత (Irrigation Water Problem) ఎలా ఉందో చెప్పడానికి నాగర్‌కర్నూలు (Nagar Kurnool) జిల్లాలోని ఓ రైతు దుస్థితి అద్దం పడుతున్నది. రెండెకరాల్లో వేసిన వరి పంట (Paddy Crop) చేతికొచ్చే దశలో ఎండిపోతోందని తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. ఒక్కో ట్యాంకర్ (Water Tanker)కు రూ.500 వెచ్చించి పక్క గ్రామం నుంచి కొనుక్కుంటున్నామని వాపోతున్నాడు. క్షేత్రస్థాయిలో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ సదరు రైతు తన గోసను వెల్లబోసుకున్నాడు.
నా పేరు గొడుగు తిరుపతయ్య. మాది నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునూతల మండలంలోని రాయచేడు గ్రామం. రెండెకరాల్లో వరి వేసిన. 10 రోజుల నుంచి బోరు పోస్తలేదు. వరి ఎండిపోతున్నది. బావులు లేవ్.. కాల్వలు కూడా రాలేదు. దీంతో ట్యాంకర్తోటి నీళ్లు తెచ్చి పారిస్తున్న. మాకు చాలా ఇబ్బందులు ఉన్నయ్. పక్కన సందాపూర్ నుంచి ట్యాంకర్‌కు రూ.500 చెల్లించి కొనుక్కొస్తున్నం. చాలా ఇబ్బంది అవుతోంది.
ముఖ్యమంత్రి స్పందిస్తే బాగుండు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి సాగు నీళ్లకు సహకరిస్తే బాగుండు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పంటలను కాపాడాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు.
సాగునీటి కోసం ట్యాంకర్లను ఆశ్రయిస్తున్న రైతు.. ఒక్కో ట్యాంకర్‌కు రూ.500!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచెడ్లో సాగునీటి కొరతతో యువరైతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రెండు ఎకరాల్లో వరి సాగు చేసిన గొడుగు తిరుపతయ్య బోరుబావి ఎండిపోవడంతో పంటను కాపాడుకునేందుకు పక్క గ్రామం నుంచి ఒక్కో వాటర్ ట్యాంకర్‌కు రూ.500 చెల్లించి నీటిని కొనుగోలు చేస్తున్నాడు.
చేతికొచ్చే దశలో ఉన్న పంట ఎండిపోకుండా ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తూ అప్పుల భారం మోస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి సాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పంటలను కాపాడాలని రైతు కోరుతున్నాడు.
— TNews Telugu (@TNewsTelugu) November 13, 2026
సంబంధిత వార్తలు

Bharat Summit Hyderabad Visa Row | అప్పుడు రేవంత్ టూర్.. ఇప్పుడు హైదరాబాద్ ‘భారత్ సమ్మిట్’! మళ్లీ తెరపైకి వీసా వివాదం
నవంబర్ 14, 2026

Road Accident | డివైడర్‌ను ఢీకొట్టి అంటుకున్న కారు.. డ్రైవర్ బయటికొచ్చేలోపే ఏం జరిగిందంటే!
నవంబర్ 14, 2026

CM Revanth Reddy | రాహుల్ నాయకత్వంలో దేశాన్ని కాపాడుకుందాం
నవంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!
- ●Gold Price | వరుసగా నాలుగో రోజూ తగ్గిన బంగారం ధర.. తులంపై రూ.2,500 డౌన్..!
- ●IAS Rajiv Hanumanthu Road Accident | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఐఏఎస్ రాజీవ్ హనుమంతు.. ఫోన్లో పరామర్శించి భరోసా ఇచ్చిన పొంగులేటి

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..

Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!

Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!



