Venkaiah Naidu | ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ల లాంటిది : వెంకయ్యనాయుడు
Venkaiah Naidu | జర్నలిజం ఒక మహావృక్షమైతే అందులో ఫొటో జర్నలిస్టులు ప్రాణం లాంటి వారని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ల లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని సూచించారు.
Venkaiah Naidu | త్రినేత్ర.న్యూస్ : జర్నలిజం ఒక మహావృక్షమైతే అందులో ఫొటో జర్నలిస్టులు ప్రాణం లాంటి వారని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఫొటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్ల లాంటిదని, దీనిని అందరూ కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్‌పీజేఏ) ఆధ్వర్యంలో ‘23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్- 2025 అవార్డుల ప్రధానోత్సవ’ కార్యక్రమం నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆదివారం జరిగింది.

ఈ కార్యక్రమానికి టీఎస్‌పీజేఏ రాష్ట్ర అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ఎం.వెంకయ్య నాయుడుతో పాటు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐఎన్టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ళ రాజిరెడ్డి, ఐజెయు జాతీయ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, టియుడబ్ల్యూజే అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రాం నారాయణ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫోటోజర్నలిస్టుల ప్రథమ బహుమతిని ఇందు శ్రీనివాస్(ఈనాడు, నిజామాబాద్), రెండవ బహుమతి ఎ.క్రిష్ణ (హాన్స్ ఇండియా, హైదరాబాద్), తృతీయ బహుమతి జి.బాలస్వామి (సాక్షి,హైదరాబాద్)లకు బహుమతులు అందజేశారు. అలాగే మరో పది మంది ఫొటో జర్నలిస్టులు ఎన్.రాజేష్ (సాక్షి,హైదరాబాద్), జి.శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్), ఎ.జాన్ (సాక్షి,హైదరాబాద్), ఆర్.రాజు(సాక్షి, ఖమ్మం), పి.వాసప్రసాద్(సాక్షి, వరంగల్), ఎం.శ్రీనివాస్(ది హన్స్ ఇండియా,నల్లగొండ), జి.వేణుగోపాల్(సాక్షి, జనగాం), ఎం.అనిల్ కుమార్ (ఆంధ్రజ్యోతి, హైదరాబాద్), వీరగోని రజనీకాంత్ గౌడ్(నమస్తే తెలంగాణ, హైదరాబాద్), ఎ.జ్వల కోటేశ్వర్ రావు (ఆంధ్రజ్యోతి, హైదరాబాద్)కు అందజేశారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రిపోర్టర్ కలం పెడితే, ఫొటో జర్నలిస్టు కళను బంధిస్తారన్నారు. తాను 1964లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పటీ నుంచి ఫొటో జర్నలిస్టులతో అనుబంధం ఉందన్నారు. ప్రపంచంలో భాషాలు ఎన్నైనా ఉండోచ్చు కానీ, ఏ భాషతో సంబంధం లేకుండా ఉండేది కేవలం ఫోటోగ్రఫీ మాత్రమేనని గుర్తు చేశారు. వంద మాటల పెట్టు ఒక ఫోటో రూపం అని అభివర్ణించారు. ఒక వ్యాసం చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుందన్నారు.

కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. గతంతో పొల్చితే ప్రస్తుత జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ప్రస్తుత ‘ఏఐ టెక్నాలజీ’ అన్ని రంగాలకు చాలా ఉపయోగకరంగా మారిందని, ముఖ్యంగా వైద్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. ఫొటో జర్నలిస్ట్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని, ప్రస్తుత ఏఐ రంగంలో ఎలా ముందుకెళ్లాలో చర్చించుకుందామని సూచించారు.

పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. అక్షర సత్యానికి ఊపిరి పోసే సాధనమే ఫొటో జర్నలిజం అని అన్నారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. నేరుగా తీసిన ఫోటోలోని సహజతత్వం, కృత్రిమంగా చిత్రీకరించిన చిత్రాలకు ఉండబోదన్నారు.
ఈ కార్యక్రమంలో టి.ఎస్.పి.జె.ఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.నరహారి, ఉపాధ్యక్షులు పి. రామ్ మూర్తి, కోశాధికారి కె.అనిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. వసంత్ కుమార్, ఏం. ఏ. సర్వర్, పి. మోహన చారి, అలీముద్దీన్, పి. హరి కృష్ణ, ఏ. మహేష్ కుమార్, నేతలు బషీరుద్దీన్, టి. వి. రమణ, రాజ్ కుమార్, పి. వెంకటేష్, గోపి, జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..
- ●Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు
- ●CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!
- ●Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు
- ●Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ - లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
- ●Kunal Ghosh | దీదీ సభకు వెళ్తుండగా.. ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

NASA | అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. మూడుసార్లు నీటితో తడిసినట్లు ఆధారాలు..

Uttam Kumar Reddy | నవంబర్ రెండోవారంలో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్ పనులు

CEC Removal Process | సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదు.. అసలు ప్రక్రియ ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది!

Indiramma Illu | కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు





