Talasani Srinivas Yadav | పండబెట్టి తొక్కుడు అట్లనే ఉండాల్నా..! శాసనసభలో అధికార పక్షం తీరుపై తలసాని ఆగ్రహం
Talasani Srinivas Yadav | శాసనసభలో అధికార పక్షం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులకు తగినంత సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం సరికాదని మండిపడ్డారు. సభా మర్యాదలను మంటగలుపుతున్నారని అధికార పక్షంపై తలసాని విరుచుకుపడ్డారు.
Talasani Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్ : శాసనసభలో అధికార పక్షం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులకు తగినంత సమయం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం సరికాదని మండిపడ్డారు. సభా మర్యాదలను మంటగలుపుతున్నారని అధికార పక్షంపై తలసాని విరుచుకుపడ్డారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతుండగా.. మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు అడ్డు తగిలారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పీకర్ అనుమతితో.. బడ్జెట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మా నాయకుడు మాట్లాడుతుంటే గంట అయిపోయిందని అంటున్నరు. టీ బ్రేక్ అని చెప్పి రెండున్నర గంటలు కూర్చోబెట్టారు. ఆ రెండున్నర గంటలు మేం కూర్చున్నాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటప్పుడు.. సీఎం ఢిల్లీ నుంచి వస్తారంటే ఐదారు గంటలు సభలోనే కూర్చున్నాం. ఆయన వచ్చిండు.. పండబెట్టి తొక్కిండ్రు అని తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
దీంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకుని.. తలసాని శ్రీనివాస్ యాదవ్ చాలా సీనియర్ సభ్యులు.. సభను తప్పుదోవ పట్టించొద్దు. సీఎం ఢిల్లీ నుంచి వస్తారు.. వారి స్పీచ్ ఉంటదని చెప్పలేదు. సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చాం. అలా సమయం ఆలస్యమై ఉండొచ్చు. కానీ సీఎం కోసం చేయలేదు.. సీనియర్ సభ్యుడిగా ఉండి ఇలా మాట్లాడొద్దని శ్రీధర్ బాబు సూచించారు.
అనంతరం మాజీ మంత్రి తతలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మీరేం మాట్లాడిన మాకేం అభ్యంతరం లేదు. సభా నాయకుడు రిప్లై ఇస్తే అభ్యంతరం లేదు. 1994 నుంచి చూస్తున్నాం. మాకు మర్యాద గౌరవం ఉంది. టీ బ్రేక్ అని చెప్పి రెండున్నర గంటలు కూర్చున్నది వాస్తవం కాదా..! ఇవాళ బడ్జెట్ గురించి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కూర్చున్నాం. గవర్నర్ ప్రసంగం అప్పుడు నాలుగుసార్లు వాయిదా వేశారు.. ఐదు గంటలు కూర్చోబెట్టారు.. ఆయన వచ్చిండు.. రాత్రి 12 గంటల వరకు పండబెట్టి తొక్కిండు.. పోయిండు.. అయినా నోరు మూసుకుని ఉన్నాం. ఇప్పుడు కూడా మాకు అవకాశం ఇవ్వకపోతే ఎలా.. సీనియర్ ఎమ్మెల్యేగా ఈ సభ గౌరవాన్ని కాపాడుతున్నామని తలసాని పేర్కొన్నారు.
సీఎం మాట్లాడే ముందు.. శ్రీధర్ బాబు మాట్లాడారు. తప్పుడు మాటలు మాట్లాడొద్దు అని సూచించారు. కేటీఆర్ మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తీసేయాలనడంతో స్పీకర్ తొలిగించారు. పండబెట్టి తొక్కుడు అట్లనే ఉండాల్నా..? క్లారిఫికేషన్ అడుగుదామంటే స్పీకర్ వెళ్లిపోయిండు. గౌరవం లేకుండా, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మాకు మైక్ ఇవ్వరు.. ఎందుకు రావాలి మేం సభకు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిలదీశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






