HJHSJAC | జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేయండి
Flash news | Published On Aug 6, 2026, 3.53 pm IST
ప్రభుత్వానికి HJHSJAC విజ్ఞప్తి
సానుకూలంగా ఉన్న సీఎంకు కృతజ్ఞతలు
HJHSJAC | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సానుకూలంగా వ్యవహరిస్తుండడం పట్ల హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (HJHSJAC) కృతఙ్ఞతలు తెలిపింది.
గురువారం బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో JAC బాధ్యులు హాజరై, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు అన్నీ హౌసింగ్ సొసైటీలు ఏకంచేసి జేఏసీగా ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ముకుంద రెడ్డితో పలు దఫాలు సమావేశమై, ఆయా జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సమగ్ర సమాచారాన్ని వారికి అందించినట్లు జేఏసీ బాధ్యులు తెలిపారు. అయితే ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరారు. మరోమారు ముఖ్యమంత్రిని, సమాచార శాఖ మంత్రిని కలిసి ఈ ప్రక్రియపై అభ్యర్థించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో జేఏసీ బాధ్యులు కె. విరాహత్ అలీ, ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, మురళీ క్రిష్ణ, గోపరాజు, రవీంద్ర బాబు, రాకేష్ రెడ్డిలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●URBN | ఒకేసారి 6 డివైస్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్.. యూఆర్బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ లాంచ్..
- ●స్ట్రాంగ్ విస్కీ వర్సెస్ వార్మ్ బ్రాందీ: మీ సోల్ మేట్ ఏది? ఈ రెండింటి అసలు తేడా ఇదే!
- ●FGG | ఉపాధ్యాయ సంఘాలను తగ్గించండి.. సీఎంకు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి
- ●Harish Rao | క్షుద్ర పూజల లొల్లి.. హరీశ్‌రావు ఏమన్నారంటే..?
- ●Tragedy in Rajahmundry | రాజమండ్రిలో దారుణం.. వైద్య విద్యార్థినిపై కారు ఎక్కించిన యువకులు
- ●సరిహద్దు కాపలా నుంచి 10 కోట్ల మొక్కల దాకా: 'టెరిటోరియల్ ఆర్మీ' రియల్ హీరోస్!

URBN | ఒకేసారి 6 డివైస్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్.. యూఆర్బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ లాంచ్..

స్ట్రాంగ్ విస్కీ వర్సెస్ వార్మ్ బ్రాందీ: మీ సోల్ మేట్ ఏది? ఈ రెండింటి అసలు తేడా ఇదే!

FGG | ఉపాధ్యాయ సంఘాలను తగ్గించండి.. సీఎంకు ఎఫ్‌జీజీ విజ్ఞప్తి

Harish Rao | క్షుద్ర పూజల లొల్లి.. హరీశ్‌రావు ఏమన్నారంటే..?



