URBN | ఒకేసారి 6 డివైస్‌లకు ఫాస్ట్ ఛార్జింగ్.. యూఆర్‌బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ లాంచ్..
URBN | యూఆర్‌బీఎన్ భారత మార్కెట్లో కొత్త 200 వాట్ల గ్యాన్ (Gallium Nitride) పవర్ హబ్‌ను విడుదల చేసింది. ఒకేసారి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, వియరబుల్స్, గేమింగ్ డివైస్‌లు, ఇయర్‌బడ్స్‌తోపాటు ఇతర యూఎస్‌బీ ఆధారిత గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ఈ పరికరాన్ని రూపొందించింది.
Technology | Published On Aug 6, 2026, 3.52 pm IST
URBN | యూఆర్‌బీఎన్ భారత మార్కెట్లో కొత్త 200 వాట్ల గ్యాన్ (Gallium Nitride) పవర్ హబ్‌ను విడుదల చేసింది. ఒకేసారి ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు, వియరబుల్స్, గేమింగ్ డివైస్‌లు, ఇయర్‌బడ్స్‌తోపాటు ఇతర యూఎస్‌బీ ఆధారిత గ్యాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ఈ పరికరాన్ని రూపొందించింది. యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి ప్రముఖ బ్రాండ్ల డివైస్‌లకు కూడా ఇది అనుకూలంగా పనిచేస్తుంది. ఈ పవర్ హబ్‌లో మొత్తం ఆరు పోర్టులు ఉన్నాయి. వీటిలో నాలుగు యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, రెండు యూఎస్‌బీ టైప్ ఎ పోర్టులు ఉన్నాయి. మొత్తం గరిష్టంగా 200 వాట్ల అవుట్‌పుట్ అందిస్తుంది. ఒకే యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ ద్వారా 100 వాట్ల వరకు పవర్ అందించడంతోపాటు యూఎస్‌బీ టైప్ ఎ పోర్ట్ ద్వారా 18 వాట్ల వరకు అవుట్‌పుట్ లభిస్తుంది.
ప్రత్యేకతలు ఇవే..
గ్యాన్ (Gallium Nitride) టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ ఛార్జర్‌లో ఇంటెలిజెంట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్‌ను అందించారు. ఒకేసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ డివైస్‌లు కనెక్ట్ చేసినప్పుడు కూడా ప్రతి డివైస్ అవసరానికి అనుగుణంగా పవర్‌ను రియల్‌టైమ్‌లో ఆటోమేటిక్‌గా పంపిణీ చేస్తుంది. భద్రత కోసం ఇందులో 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్, అధునాతన థర్మల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమర్చారు. వేడి నియంత్రణతోపాటు సురక్షిత ఛార్జింగ్‌ను ఇది నిర్ధారిస్తుంది. ఈ పవర్ హబ్‌కు విడదీయగలిగే మౌంటింగ్ బ్రాకెట్‌ను అందించారు. దీనిని అడ్డంగా లేదా నిలువుగా అమర్చుకునే వీలుంది. అలాగే 1.5 మీటర్ల డిటాచబుల్ పవర్ కార్డ్ కూడా అందించారు. ఈ పవర్ హబ్ ఏసీ 110-240వి, 50-60 హెడ్జ్, 3 ఆంప్స్ (గరిష్టం) ఇన్‌పుట్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ దీనిపై ఒక సంవత్సరం వారంటీ అందిస్తోంది. యూఆర్‌బీఎన్ 200 వాట్ల గ్యాన్ పవర్ హబ్ ధరను రూ. 6,999గా నిర్ణయించారు. ఇది యూఆర్‌బీఎన్ వరల్డ్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
తాజావార్తలు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు సెగ.. భారీ నష్టాల్లో సూచీలు..

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్

Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..





