Harish Rao | ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లకు డిమాండ్ ఎప్పటికీ తగ్గదు : హరీశ్‌రావు
Harish Rao | ప్రస్తుతం టెక్నాలజీ మారి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.. ఫంక్షన్లలో అందరూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వృత్తికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు, దానికి ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుంది అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతం టెక్నాలజీ మారి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి.. ఫంక్షన్లలో అందరూ సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నప్పటికీ.. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ వృత్తికి ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదు, దానికి ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుంది అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఫొటోగ్రాఫర్ల కోసం ఏర్పాటు చేసిన వెడ్డింగ్ ఫొటోగ్రఫీ బిజినెస్ వర్క్ షాప్‌కు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వంద మాటలు చెప్పలేని భావాన్ని, సారాంశాన్ని ఒక అద్భుతమైన ఫోటో చెబుతుంది. ఫోటోగ్రఫీకి సమాజంలో అంతటి గొప్ప విలువ ఉంది. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీలు వస్తున్న తరుణంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు సైతం ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్లు కూడా తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే వెనుకబడిపోతారు. మీ నైపుణ్యాలను పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ వర్క్ షాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి అని హరీశ్‌రావు సూచించారు.

సిద్దిపేటలోని కోమటి చెరువు, రంగనాయక సాగర్ వంటి సుందరమైన ప్రాంతాలు ఇప్పుడు ఫోటోషూట్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారి, ఎప్పుడూ కళకళలాడుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మార్కెట్లో డబ్బుల చెలామణి ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడంతో ప్రజల చేతుల్లో డబ్బు లేక శుభకార్యాల ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. దీనివల్ల ఫోటోగ్రాఫర్లకు వచ్చే గిరాకీ, ఆదాయం కూడా సగానికి పడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వ స్థలం ఇచ్చి, ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా ఒక భవనం నిర్మించిన ఏకైక ప్రాంతం మన సిద్దిపేట మాత్రమే. ఆ భవనానికి సంబంధించి మిగిలి ఉన్న కొద్దిపాటి పనులను కూడా త్వరలో పూర్తి చేసి, పూర్తిగా వినియోగంలోకి తీసుకొస్తాము. ఫోటోగ్రాఫర్లకు ఉచిత ఓపీ సేవలు అందించే ఉద్దేశంతో హెల్త్ కార్డులు పంపిణీ చేయడం చాలా సంతోషకరం. ఈ కష్టకాలం పోయి ఫోటోగ్రాఫర్లకు మళ్లీ మంచి రోజులు రావాలని, వ్యాపారం బాగా జరిగి మీరంతా ఆర్థికంగా స్థిరపడాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
- ●Delhi Dust Storm | ఢిల్లీని వణికించిన గాలి దుమారం: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షం

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన





