త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

EdCET Results 2026 | ఎడ్‌సెట్ ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌.. 96.95 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు

EdCET Results 2026 | తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు (TG EdCET 2026 Results) శ‌నివారం మ‌ధ్యాహ్నం విడుదలయ్యాయి. 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

S

Telangana | Published On May 30, 2026, 2.58 pm IST

EdCET Results 2026 | ఎడ్‌సెట్ ఫ‌లితాలు వ‌చ్చేశాయ్‌.. 96.95 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
Advertisement

EdCET Results 2026 | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు (TG EdCET 2026 Results) శ‌నివారం మ‌ధ్యాహ్నం విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఈ ఫలితాలను వెలువ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 35,600 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 29,342 మంది ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. హాజ‌రైన వారిలో 28,446 మంది అభ్యర్థులు అర్హత సాధించగా 96.95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫ‌లితాల్లో బానోత్‌ అజిత్‌ సాయి ఎడ్‌సెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు.

కాగా రెండేళ్ల బీఈడి కోర్స్ కోసం ఈ నెల 12న ఎడ్‌సెట్ ఎంట్రన్స్ నిర్వహించారు. స్కోర్‌కార్డుతో పాటు ఫైన‌ల్ ఆన్స‌ర్ కీ ని అధికారులు వెబ్‌సైట్ లో ఉంచ‌నున్నారు. కౌన్సెలింగ్ ప్ర‌క్రియ‌లో స్కోర్‌కార్డ్ చూపించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి అభ్య‌ర్థులు ప్రింట్అవుట్ తీసి భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

వెబ్‌సైట్‌: edcet.tgche.ac.in

Advertisement
Advertisement