త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Doctor N Vani | తెలంగాణ వైద్య విద్యా సంచాల‌కురాలుగా డాక్ట‌ర్ ఎన్ వాణి

Doctor N Vani | తెలంగాణ వైద్య విద్యా సంచాలకురాలు( DME ) గా డాక్ట‌ర్ ఎన్‌ వాణి పదోన్నతిపై నియమితులయ్యారు. అదనపు డీఎంఈగా సేవలందించిన ఎన్ వాణి, పదోన్నతి అనంతరం డీఎంఈగా బాధ్యతలు చేపట్టనున్నారు.

S

Telangana | Published On Jul 31, 2026, 4.48 pm IST

Doctor N Vani | తెలంగాణ వైద్య విద్యా సంచాల‌కురాలుగా డాక్ట‌ర్ ఎన్ వాణి
Advertisement

Doctor N Vani | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వైద్య విద్యా సంచాలకురాలు( DME ) గా డాక్ట‌ర్ ఎన్‌ వాణి పదోన్నతిపై నియమితులయ్యారు. అదనపు డీఎంఈగా సేవలందించిన ఎన్ వాణి, పదోన్నతి అనంతరం డీఎంఈగా బాధ్యతలు చేపట్టనున్నారు. జూలై 31న పదవీ విరమణ చేస్తున్న డాక్ట‌ర్ ఎ నరేంద్ర కుమార్ గారి స్థానంలో ఆమె నియమితులయ్యారు.

ఆమె వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో 1981 బ్యాచ్‌లో ఎంబీబీఎస్‌, 1990లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993లో సహాయ ప్రొఫెసర్‌గా, 2006లో ప్రొఫెసర్‌గా కాకతీయ మెడికల్‌ కాలేజీలో పనిచేశారు. 2020లో రెండేండ్ల పాటు సంగారెడ్డి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. 2024లో ఏడాది పాటు డీఎంఈగా విధులు నిర్వహించారు. గాంధీ దవాఖానకు సూపరింటెండెంట్‌గా కూడా డాక్ట‌ర్ వాణి సేవ‌లందించారు.

ఇక మ‌ర్రి చెన్నారెడ్డి టిమ్స్‌(స‌న‌త్‌న‌గ‌ర్‌) కు ఇంచార్జి డైరెక్ట‌ర్‌గా డాక్ట‌ర్ ఎ న‌రేంద్ర కుమార్ నియ‌మితుల‌య్యారు. 2026 ఆగ‌స్టు 1వ తేదీ నుంచి టిమ్స్ ఇంచార్జి డైరెక్ట‌ర్‌గా బాధ్య‌తలు స్వీక‌రించ‌నున్నారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుడిగా (Director of Medical Education) సేవలందిస్తున్న డా. నరేంద్ర కుమార్ జూలై 31న పదవీ విరమణ చేయ‌నున్నారు.

Advertisement
Advertisement