Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
Rahul Ramakrishna | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ( Rahul Ramakrishna ) మరోసారి వార్తల్లో నిలిచారు.
Entertainment | Published On Aug 25, 2026, 8.11 pm IST
Rahul Ramakrishna | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ( Rahul Ramakrishna ) మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించే ఈ విలక్షణ నటుడు.. తాజాగా ఎక్స్ వేదికగా చేసిన పోస్టు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చందుకుంది.
రాహుల్ రామకృష్ణ.. సోమవారం ఉదయం ఎక్స్ వేదికగా కేసీఆర్ పట్ల తనకున్న అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘చితి చివరిదాంక… KCR!’ అని తన ట్విట్టర్ వాల్‌పై రాశారు. ఈ పోస్టు చేసిన క్షణాల్లోనే అది వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది..? సందర్భం ఏంటి..? అనే అంశాలను రాహుల్ వివరించలేదు. కానీ కింద మాత్రం కామెంట్ల వరద ప్రవాహం కొనసాగింది. మెజార్టీ నెటిజన్లు రాహుల్‌ను విమర్శిస్తూ పోస్టులు చేశారు. కేసీఆర్ అభిమానులు మాత్రం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు.
గతంలోనూ వివాదాస్పద పోస్టులు..
రాజకీయ అంశాలపై రాహుల్ స్పందించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఆయన రాజకీయాలపై స్పందించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‍ను ఉద్దేశించి చేసిన ట్వీట్లు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ సమయంలో జనసేన అభిమానుల నుంచి రాహుల్ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యాడు.
గతేడాది కాంగ్రెస్ పాలనపై విమర్శలు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని గతేడాది సెప్టెంబర్ నెలలో రాహుల్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై రాహుల్‌ను విమర్శిస్తూ.. కాంగ్రెస్ నాయకులు అతడిపై విమర్శలు గుప్పించడంతో పాటు బెదిరింపు కాల్స్ చేశారు. దీంతో భయపడిన రాహుల్.. ఎక్స్‌కి డీ యాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు దూరంగా గడిపాడు. అయితే తాజాగా ఈ వివాదంపై మరోసారి స్పందిస్తూ.. రాహుల్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో ఇకపై ట్విట్టర్ యాక్టివిజం నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన భవిష్యత్తు దృష్టి కేవలం సినిమాలపైనే ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. చివర్లో “జై తెలంగాణ, జై హింద్” అని రాసుకొచ్చారు.
నటుడే కాదు.. రచయితగా కూడా గుర్తింపు
విలక్షణమైన కామెడీ, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్.. ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘బ్రోచేవారెవరురా’, ‘జాతి రత్నాలు’, ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘ఓం భీమ్ బుష్’ వంటి హిట్ చిత్రాల్లో నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
పారాక్వాట్ గడ్డి మందుపై కూడా పోరాటం
రాజకీయ అంశాలపై కాదు.. సామాజిక అంశాలపై స్పందించే గుణం, ప్రశ్నించే తత్వం రాహుల్‌లో ఉందనడానికి ఇది నిదర్శనం. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పారాక్వాట్ అనే అత్యంత ప్రమాదకరమైన గడ్డి నివారణ మందును నిషేధించాలని గతంలో సోషల్ మీడియా వేదికగా ప్రధానికి, తెలంగాణ సీఎంకు బహిరంగంగా విన్నవించారు. తన సోదరుడు గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయాడని, దీన్ని నిషేధించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ప్రాణాంతక మందును తక్షణమే నిషేధించి మరిన్ని ప్రాణాలు పోకుండా కాపాడాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఇప్పటికే పలు దేశాల్లో నిషేధానికి గురైన ఈ రసాయనంపై భారత్‌లో కూడా ఆంక్షలు విధించాలనే డిమాండ్‌కు నెటిజన్ల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
ఇటీవలే డిగ్రీలో చేరిన రాహుల్ రామకృష్ణ

రాహుల్ రామకృష్ణ ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేశాడు. ఆ తర్వాత జర్నలిస్టుగా రాణించాడు. జర్నలిస్టు వృత్తి కొనసాగిస్తూనే నటుడిగా, రచయితగా మారిపోయాడు. మళ్లీ చదవాలనే కోరిక కలగడంతో.. ఆయన ఇటీవలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలో ప్రవేశం పొందాడు. ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణను అభినందించిన వైస్ ఛాన్స్‌లర్ ఘంటా చక్రపాణి ఆయనకు బీ.ఏ కోర్సు పుస్తకాలను అందించారు.
ఫిలిం రిపోర్టర్ అవుదామనుకుని..
రాహుల్ రామకృష్ణ పలు ఇంగ్లీష్ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రధాన దినపత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. అందులోనూ మరి ముఖ్యంగా క్రైమ్ బీట్ చూశారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఫిలిం రిపోర్టర్‌గా మారుదామనుకున్నాడు.. మొత్తానికి ఆ సినిమా రంగంలోనే నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
చితి చివరిదాంక…. KCR!
— Rahul Ramakrishna (@eyrahul) August 24, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు



