త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Theranym Biologics | ‘థెరానిమ్‌ బ‌యోలాజిక్స్‌’కు మంత్రులు దుద్దిళ్ల‌, దామోద‌ర భూమిపూజ‌

Theranym Biologics | సంగారెడ్డి జిల్లా హ‌త్నూర మండ‌లం బోర్ప‌ట్ల గ్రామ ప‌రిధిలోని నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న థెరానిమ్‌ బ‌యోలాజిక్స్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఫెసిలిటీ సెంట‌ర్‌కు రాష్ట్ర మంత్రులు దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు క‌లిసి బుధ‌వారం భూమి పూజ చేశారు.

S

Telangana | Published On Jun 3, 2026, 5.01 pm IST

Theranym Biologics | ‘థెరానిమ్‌ బ‌యోలాజిక్స్‌’కు మంత్రులు దుద్దిళ్ల‌, దామోద‌ర భూమిపూజ‌
Advertisement

Theranym Biologics | త్రినేత్ర‌.న్యూస్ : సంగారెడ్డి జిల్లా హ‌త్నూర మండ‌లం బోర్ప‌ట్ల గ్రామ ప‌రిధిలోని నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న థెరానిమ్‌ బ‌యోలాజిక్స్ మాన్యుఫ్యాక్చ‌రింగ్ ఫెసిలిటీ సెంట‌ర్‌కు రాష్ట్ర మంత్రులు దామోద‌ర్ రాజ‌న‌ర్సింహా, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు క‌లిసి బుధ‌వారం భూమి పూజ చేశారు.

రూ.1200 కోట్ల భారీ పెట్టుబడితో.. ఈ అత్యాధునిక ఫెసిలిటీలో క్యాన్సర్, ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాలను ఉత్పత్తి చేయ‌నున్నారు. యూఎస్ సహా పలు అంతర్జాతీయ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. ఈ నూతన ఫెసిలిటీ ద్వారా సుమారు 1500 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. థెరానిమ్ బ‌యోలాజిక్స్ రాక‌తో లైఫ్ సైన్సెస్ రంగంలో "మేడ్ ఇన్ తెలంగాణ" బ్రాండ్ విలువ అంతర్జాతీయ స్థాయిలో మరింత పటిష్ఠం కానుంది.

Advertisement
Advertisement